యజమానిపై దాడి, బంగారంతో పరార్: ముగ్గురు భారతీయులపై షార్జాలో లుక్ ఔట్ నోటీసులు  

sharjah police on friday were on the lookout for three indian men - Telugu Nri,, Telugu Nri News

పనిచేస్తున్న యజమానిపై దాడికి పాల్పడి, అతని వద్ద నుంచి 4 కేజీల బంగారం బిస్కెట్లను దోచుకుని పారిపోయిన ముగ్గురు భారతీయులపై షార్జా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

TeluguStop.com - Sharjah Police On Friday Were On The Lookout For Three Indian Men

శుక్రవారం మధ్యాహ్నం ఈ ముగ్గురు భారతీయులు తాము పనిచేస్తున్న 57 ఏళ్ల బంగ్లాదేశీ యజమానిపై దాడి చేసి, అతని వర్క్‌షాప్‌లోని లాకర్ నుంచి బంగారం, పాస్‌పోర్ట్‌లను తీసుకుని యూఏఈ నుంచి పారిపోయినట్లు గల్ఫ్ న్యూస్ తన కథనంలో పేర్కొంది.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన బృందం ఘటనాస్థలికి చేరుకుని, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించింది.ఇందులో ముగ్గురు భారతీయులు యజమానిపై స్టీల్ రాడ్‌తో కొట్టడాన్ని గమనించారు.నిందితులు ప్లాన్ ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.ఘటన జరిగిన గంటలోపే వారు షార్జా నుంచి ముంబై వెళ్లే విమానంలో భారత్‌కు బయల్దేరినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

TeluguStop.com - యజమానిపై దాడి, బంగారంతో పరార్: ముగ్గురు భారతీయులపై షార్జాలో లుక్ ఔట్ నోటీసులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లోని ప్రఖ్యాత గోల్డ్ సౌక్ ప్రాంతంలోని ఓ దుకాణంలో క్లీనర్‌గా పనిచేస్తున్న భారతీయుడు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు.అతను దుకాణాన్ని శుభ్రపరుస్తున్నట్లుగా నటిస్తూ, విలువైన వాచ్‌లను చోరీ చేసి వాటిని చెత్త డబ్బాలో వేసేవాడు.కొట్టేసిన సొమ్మును చాకచక్యంగా అక్కడి నుంచి మరో చోటికి తీసుకెళ్లి విక్రయించేవాడు.

యజమానులకు అనుమానం వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా భారతీయుడి బండారం బయటపడింది.

#SharjahPolice

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sharjah Police On Friday Were On The Lookout For Three Indian Men Related Telugu News,Photos/Pics,Images..