హీరోగా ఎంట్రీ ఇస్తున్న శరవణన్ స్టోర్స్ అధినేత  

హీరోగా ఎంట్రీ ఇస్తున్న శరవణన్ స్టోర్స్ అధినేత. .

Sharavanan Store Md Introduced As A Hero In Kollywood-sharavanan,sharavanan Store Md,tamil Cinema

తమిళనాడులో శరవణన్ స్టోర్స్ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శరవణన్ స్టోర్స్ అడ్వర్టైజ్ మెంట్ లో కనిపిస్తూ యాడ్స్ ద్వారా భాగా పాపులర్ అయిన శరవణన్ స్టోర్స్ అధినేత శరవణన్ కి కోలీవుడ్ సర్కిల్ లో మంచి ఇమేజ్ ఉంది. స్టార్ హీరోయిన్స్ తో కలిసి యాడ్స్ లో ఆడిపాడిన శరవణన్, లలితా జ్యూయిలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ని ఆదర్శంగా తీసుకొని యాడ్స్ లో తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు..

హీరోగా ఎంట్రీ ఇస్తున్న శరవణన్ స్టోర్స్ అధినేత-Sharavanan Store MD Introduced As A Hero In Kollywood

ఇదిలా ఉంటే శరవణన్ ఇప్పుడు కోలీవుడ్ లో హీరో అయిపోయాడని తెలుస్తుంది. అతను నటించిన సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జేడీ-జెర్రీ అనే దర్శకుల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ దర్శకులకి కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమా తో దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ యువ దర్శక ద్వయం శరవణన్ ని సిల్వర్ స్క్రీన్ మీద చాలా గ్రాండ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.