ప్రభుత్వ ఏర్పాటు పై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్, ఎన్సీపీ అడుగు ఎటువైపో

మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచిపోయినప్పటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటు పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.శివసేన పార్టీ ఎన్సీపీ,కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని శివసేనప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది.

 Sharad Pawar To Meet Pm Modi Today-TeluguStop.com

అయితే ఈ క్రమంలో చర్చలు కూడా జరిగి శివసేన డిమాండ్స్ ను కూడా ఇరు పార్టీలు ఒప్పుకొని పొత్తు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఈ విషయమై మరోసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ భేటీ కంటే ముందు పవార్ బీజేపీ అధినేత ప్రధాని నరేంద్ర మోదీ ని కలుసుకోవడం ఇప్పుడు పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే ఈ భేటీ లో ఎలాంటి అంశాలను చర్చిస్తారు అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం మాత్రం పవార్ మోదీతో జరిపే సమావేశంలో రైతు సమస్యలపై చర్చించనున్నట్లు ఎన్సీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటు పై ఇంకా కొనస

మరోపక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజునే పవార్‌ను ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రశంసించడం, ఈ రోజు వారిద్దరూ భేటీ కానుండడం తో ఇప్పుడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరి మహారాష్ట్ర లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube