'మహా' గవర్నర్ వ్యాఖ్యలపై చురకలు అంటించిన పవార్

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఇటీవల మహా సీఎం ఉద్దవ్ ఠాక్రే కు రాసిన లేఖ విమర్శల పాలైన విషయం తెలిసిందే.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం గవర్నర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన విషయం విదితమే.

 Sharad Pawar Comments On Maharashtra Governor Maharastra Governor, Sharadh Pawa-TeluguStop.com

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొషియారీ ఇటీవల సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖలో వాడి న భాష సరిగాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తప్పుబట్టారు.‘ఆ లేఖలో ఎంచుకున్న పదాలు సబబుకాదు.

గవర్నర్‌ సంయమనం పాటించి లేఖ రాసి ఉండాల్సింది’ అని షా వ్యాఖ్యలు చేశారు.

ఆయన వాడిన కొన్ని పదాలు కొంచం అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ షా అభిప్రాయపడ్డారు.

అయితే షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తాజాగా ఘాటుగా స్పందించారు.‘‘ఆత్మ గౌరవం ఉన్నవారెవరూ ఆ పదవిలో కొనసాగరు’’ అంటూ గవర్నర్‌కు పవార్ చురకలంటించే ప్రయత్నం చేశారు.

గవర్నర్ రాసిన లేఖలో గవర్నర్ కోషియారీ వాడిన భాష సరికాదని సాక్షాత్తూ హోంమంత్రి షా కూడా అన్నారని ఆయన అయినా అసలు ఆత్మగౌరవం ఉన్న ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలా? వద్దా? అని ఆలోచిస్తారు అంటూ పవార్ వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్రలో దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవడంపై కొషియారీ.

సీఎంకు లేఖ రాశారు.భారీ జన సమూహాలు గుమిగూడితే కొవిడ్‌ విషమించవచ్చని, అందుకే ఆలయాలు తెరవడం లేదని ఉద్ధవ్‌ పేర్కొనడాన్ని విమర్శిస్తూ కొషియారీ లేఖ రాసిన విషయం విదితమే.

‘విచిత్రం ఏమిటంటే మీరు బార్లు తెరుస్తారు, రెస్టారెంట్లు తెరుస్తారు, బీచ్‌లు తెరుస్తారు.దేవుళ్లు, దేవతలను నిరంతరం లాక్‌డౌన్‌లోనే ఉంచుతున్నారు.

మీకేమైనా దివ్య సంకేతాలు అందుతున్నాయా? ప్రార్థనా స్థలాలను తెరవడాన్ని వాయిదా వేస్తున్నారు? సెక్యులర్‌ పదాన్ని ఎన్నో ఏళ్ల పాటు ద్వేషించిన మీరు ఆకస్మికంగా లౌకికవాదిగా మారిపోయారా?’ అని అంటూ గవర్నర్ రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది.దీనితో ఈ లేఖ పై పెద్ద రాజకీయ చర్చే నడుస్తుంది.

గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి సెక్యులర్ పదం వాడడం పై కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube