ఈ చేప చాలా అరుదైన‌దంట‌.. కెమెరాకు చిక్క‌డంతో వెలుగులోకి

కొన్ని కొన్ని జీవుల‌ను చూస్తుంటే మ‌న కండ్ల‌ను మ‌నమే న‌మ్మ‌లేనంత‌గా అవి మెస్మ‌రైజ్ చేస్తుంటాయి.ఇక స‌మ‌ద్రంలో జీవించే చేప‌ల్లో చాలా అరుదైన‌వి కూడా ఉంటాయి.

 Shape Shifting Fish Spotted At California Coast, Rare Fishes, Whale Fist, Califo-TeluguStop.com

ఇవి ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే క‌నిపిస్తూ ఉంటాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి చేప ఒక‌టి నెట్టింట‌కు వ‌చ్చింది.

దాన్ని చూసిన వారంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.వాస్త‌వానికి సముద్రం గర్భంలో అత్యంత లోతులో జీవించే చేప‌ల్లో వేల్‌ఫిష్ అనేది చాలా అరుదుగా బ‌య‌ట‌కు వ‌స్తుందంట‌.

ఇక దీన్ని కాస్త రీసెంట్ గా మోన్‌టెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ప‌నిచేస్తున్ సైంటిస్టులు మాత్ర‌మే క‌నిపెట్టారు.

ఇక వెంట‌నే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఈ చేపను కాస్తా ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

మోన్‌టెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ప‌నిచేస్తున్న సైంటిస్టులు ఎప్ప‌టి నుంచో సముద్ర గర్భంలో నివ‌సించే చాలా అరుదైన జీవ‌రాశుల‌పై సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నార‌ని స‌మాచారం.ఇక వీరు ఎప్ప‌టి నుంచో 34 ఏళ్లలో చాలా కొన్ని సార్లు మాత్ర‌మే అంటే 18 సార్లు క‌నిపించంద‌ని వారు చెప్తున్నారంటే ఇది ఎంత అరుదైన‌దో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ చేప లాస్ట్ సారి క‌నిపించిన దానితో పోలిస్తే చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ కనిపించిందంట‌.

వాస్త‌వానికి వీరు వేరే ప‌నిమీద మోట్ సబ్‌మెరైన్‌ను సముద్ర అట్ట‌డుక్కు పంపించి వివిధ విభాగాల్లో సెర్చింగ్ జ‌రుపుతుండ‌గా అనుకోకుండా ఈ అరుదైన చేప వారి కెమెరాల‌కు చిక్క‌న‌ట్టు తెలుస్తోంది.

సముద్ర గర్భంలో ఇవి చాలా లోతులో మాత్ర‌మే జీవిస్తాయ‌ని స‌మాచారం.ఈ అరుతైన చేప కూడా కాలిఫోర్నియా సముద్ర తీరం లో వారు స‌బ్ మెరైన్ ద్వారా ప‌నిచేస్తుండ‌గా దాదాపు 6600 అడుగుల లోతులో ఈ చేప సంచ‌రిస్తున్న‌ట్టు వారు గుర్తించారు.

ఇప్పుడు దీని ఫొటో నెట్టింట్ విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube