అవకాశాలు ఇవ్వండి అంటూ స్టేజ్ మీద ఏడ్చిన హీరోయిన్

తెలుగులో శుశాంత్, ఆది సాయి కుమార్ కి జోడీగా నటించిన కన్నడ భామ శాన్వీ శ్రివాస్తవ్.అందానికి అందం, అభినయం ఉన్న ఈ భామ తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

 Shanvi Srivastava Feel Emotional On Stage-TeluguStop.com

ఇక తన మాతృ ఇండస్ట్రీ అయిన కన్నడంలో కొంత కాలంలో మంచి ఇమేజ్ తో వరుస సినిమాలు చేసిన ఈ భామకి ఈ మధ్య అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోయాయి.ప్రస్తుతం కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా వస్తున్నా అతడే శ్రీమన్నారాయణ సినిమాలో శాన్వి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తుంది.

తెలుగు, కన్నడ బాషలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 27న విడుదల కానుంది.ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం పాల్గొన్న హీరోయిన్ శాన్వి మాట్లాడుతూ కాస్తా భావోద్వేగానికి గురైంది.

తనని తాను నటిగా ప్రూవ్ చేసుకోవడానికి దయచేసి అవకాశాలు ఇవ్వాలని దర్శక, నిర్మాతలని వేడుకుంది.కేవలం గ్లామర్ పాత్రలు చూసి తరువాత పక్కన పెట్టడం కరెక్ట్ కాదని, సరైన పాత్రలు ఇస్తే తానెంటో ప్రూవ్ చేసుకుంటా అని కన్నీళ్లు పెట్టుకుంది.

మొత్తానికి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఒక హీరోయిన్ ఇలా స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పటి వరకు ఎవరు చూసి ఉండకపోయిన శాన్వి ఎమోషన్ మాత్రం ఫంక్షన్ లో కాస్తా హాట్ టాపిక్ గా మారడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube