షన్నూ దీప్తి బ్రేకప్‌.. మరి సిరి శ్రీహాన్‌ పరిస్థితి ఏంటో?

బిగ్ బాస్ కారణంగానే షన్నూ మరియు దీప్తి సునైనలు విడి పోయారు అనేది నూటికి 99 శాతం మంది బలంగా నమ్ముతున్న విషయం.బిగ్‌ బాస్ లో షన్నూ మరియు సిరిల వ్యవహారం కారణంగానే దీప్తి సునైన ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

 Shannu And Deepthi Breakup What About Siri And Sreehan, Shannu  , Deepthi , Siri-TeluguStop.com

దానికి షన్నూ నుండి వచ్చిన సమాధానం కూడా దీప్తికి నచ్చలేదు అందుకే ఇద్దరు విడి పోయారు అనేది సోషల్‌ మీడియా పుకారు.ఈ పుకారు ఎలా ఉన్నా వారు విడి పోవడం అనేది నిజమే.

ఇద్దరు కూడా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు.బిగ్‌ బాస్ నుండి బయటకు వచ్చిన షన్నూ లవ్ మ్యాటర్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

బ్రేకప్ అవ్వబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.పుకార్లను నిజం చేస్తూ వారిద్దరు కూడా బ్రేకప్‌ అనేశారు.

సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా చెప్పేశారు.బిగ్‌ బాస్ లో షన్నూ ఎంతగా రియాక్ట్‌ అయ్యాడో అంతకు ఒక శాతం ఎక్కువే సిరి రియాక్ట్‌ అయ్యింది అనేది కొందరి వాదన.

సిరి నుండి సిగ్నల్‌ రావడం వల్లే షన్నూ అడ్వాన్స్ అయ్యాడని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో సిరి వాళ్ల రిలేషన్ ఎలా ఉంది.

ఆమె గత కొంత కాలంగా సహజీవనం సాగిస్తున్న శ్రీహాన్ తో ఆమె రిలేషన్‌ కొనసాగుతుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.బిగ్‌ బాస్ ఫినాలే ఎపిసోడ్‌ లో శ్రీహాన్ కూడా కనిపించలేదు.

కనుక ఆ ఇద్దరు కూడా బ్రేకప్‌ అయ్యి ఉంటారా అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్లుగా తాజా వీడియో తో క్లారిటీ వచ్చింది.

Telugu Bigg Boss, Biggboss, Deepthi, Shannu, Siri, Sreehan-Movie

సోషల్‌ మీడియాలో సిరి మరియు శ్రీహాన్ లు కొత్త సంవత్సరం వేడుకలు తమ దత్త పుత్రుడితో సంతోషంగా చేసుకుంటున్నట్లుగా వీడియో షేర్‌ చేశారు.దాంతో ఆ ఇద్దరు బాగానే ఉన్నారు.ఈ ఇద్దరే విడిపోయారు అంటూ నెట్టింట కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీప్తి ఈ విషయంలో ఆలోచించి ఉండాల్సిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube