రేపు గుడ్ న్యూస్ చెప్పబోతున్న షణ్ముఖ్.. అన్నింటికీ ముహూర్తం ఫిక్స్?

షణ్ముఖ్ జస్వంత్ ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ లో వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు.

 Shanmukh Jaswanth Special Announcement On 19th January, Shanmukh Jaswanth, Deept-TeluguStop.com

ఇతనికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక అతనికి ఉన్న క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంట్రీ ఇచ్చాడు.

చివరగా బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ అవగానే అతని అభిమానులు ఖచ్చితంగా అతనే బిగ్ బాస్ టైటిల్ ను గెలుస్తాడు అని అభిప్రాయపడ్డారు.

కానీ చివరిలో రన్నరప్ గా నిలిచి సరిపెట్టుకున్నాడు.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, కంటెస్టెంట్ సిరి తో హగ్గులు, కిస్సులు అంటూ రెచ్చిపోయిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లో ఆమెపై పెత్తనం చెలాయించడం, ఎమోషనల్ అవ్వడం, ఇద్దరూ కలిసి ఒకే దుప్పటిలో పడుకోవడం లాంటివి చేయడంతో అతడిపై ప్రేక్షకులకు నెగిటివిటీ ఏర్పడింది.బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఎంత క్రేజ్ తో ఎంట్రీ ఇచ్చాడో, బయటికి వచ్చే ముందు అంతే నెగిటివిటీ మూటగట్టుకుని వచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్ముక్ ని కలవడానికి దీప్తి సునయన ఇష్టపడటం లేదు.అంతే కాకుండా షణ్ముఖ్ జస్వంత్ నెంబర్ కూడా బ్లాక్ చేసేసిందట.

అలా మొత్తానికి షణ్ముఖ్ కీ ఆమె బ్రేకప్ కూడా చెప్పేసింది.

Telugu Bigg Boss, Deepthi Sunaina-Movie

ఇక ఆ బాధ నుంచి కోలుకున్న షణ్ముక్ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయినట్లు తెలుస్తోంది.ఆ మధ్య ఒక సారి తన కొత్త ప్రాజెక్టు కు సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తాను అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ అప్డేట్ సంక్రాంతికి వస్తుంది అని అంతా అనుకున్నారు కానీ రాలేదు.

తాజాగా షణ్ముఖ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు జనవరి 19 సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube