శ్రీహాన్ ను తిట్టిన షణ్ముఖ్.. మళ్ళీ దుప్పట్లో దూరిన సిరి.. అన్ సీన్ లో దారుణాలు!

బిగ్ బాస్ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.మరొక మూడు రోజులలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ ఎవరో తేలనుంది.

 Shanmukh Jaswanth Controversial Comments On Srihan Over Vj Sunny No 1 Position Shanmukh Jaswanth, Siri, Srihan, Bigg Boss Telugu 5-TeluguStop.com

ఇక గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతుండటంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరుగుతోంది.ఇక చివరి వారంలో టాస్క్ లు ఏమీ లేకపోవడంతో కంటెస్టెంట్ అందరు రిలాక్స్ లో ఉండగా సిరి,షణ్ముఖ్ మాత్రం వారి పనిలో వారు ఉన్నారు.

బిగ్ బాస్ షో ముగుస్తుండటంతో వీరి హాగ్ డోస్ ఇంకా పెంచేశారు.తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సిరి అర్ధరాత్రి బయట కూర్చుని ఉండగా షణ్ముఖ్  వచ్చి పక్కకు జరుగు అని అనగా ఏమిటి నువ్వు ఇక్కడే కూర్చొవాలా? అక్కడ కూర్చోవచ్చు కదా అంటూ సిరి అలకతో పక్కకు జరుగుతుంది.

 Shanmukh Jaswanth Controversial Comments On Srihan Over Vj Sunny No 1 Position Shanmukh Jaswanth, Siri, Srihan, Bigg Boss Telugu 5-శ్రీహాన్ ను తిట్టిన షణ్ముఖ్.. మళ్ళీ దుప్పట్లో దూరిన సిరి.. అన్ సీన్ లో దారుణాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడు షణ్ముక్ ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్ ఉన్నదే మూడు,నాలుగు రోజులు ఎందుకు సీన్ చేస్తున్నావ్? అంటూ అని అడగగా.అప్పుడు సిరి నా పేరు ఎందుకు చింపేశావ్.

నీ పేరు చింపితే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అంటూ షణ్ముఖ్  పై ఫైర్ అవుతుంది సిరి.ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావ్? నీకు ఇష్టముంటే మాట్లాడతావు అంటూ సిరి మాట్లాడుతుంది.అలా వారిద్దరూ కొద్దిసేపు వాదించుకుంటూ ఉంటారు.సిరి తన పేరు పక్కన షణ్ముఖ్ పేరు రాసుకోవడంతో షణ్ముఖ్ దాన్ని చింపేస్తాడు ఆ విషయంలో సిరి బాగా ఫీల్ అయిపోయింది.

తెల్లవారిన తర్వాత కూడా సిరి,షణ్ముఖ్ అవే ముచ్చట్లు పెట్టారు.

ఇద్దరూ ఒక పక్కన బెడ్ పై పడుకొని ఒకరి చెయ్ మరొకరు పట్టుకుని ఉంటారు.నువ్వు జెన్యూన్ ఫ్రెండ్ వి రా అని సిరి షణ్ముఖ్ నీ అనగ .మరి ఫేక్ అని అన్నావ్ అని అడుగుతాడు షన్ను అప్పుడు ఏదో కోపంలో అన్నాను లేరా అని అంటుంది.ఆ తర్వాత షణ్ముఖ్  సిరి ప్రియుడు సన్నీకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం పై ఫైర్ అవుతాడు.ఇదంతా వెళ్లి మీ చోటుకి చెప్పు.ఫస్ట్ ప్లేస్ బాగా ఇచ్చావు.ఇలాగే ఎంకరేజ్ చేయి అని చెప్పు.

మీ కోసం స్టాండ్ తీసుకుంటే మీరేమో అవతలి వాడికి రెస్పెక్ట్ ఇస్తారు అంటూ సిరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు షన్ను. షణ్ముఖ్ అన్ని మాటలు తన ప్రియుడి గురించి అంటున్న కూడా ఆమె మాత్రం నోరు మెదపలేదు.

మొన్న తన తల్లి గురించి సిరి ఏమి మాట్లాడలేదు.నువ్వు నా మీద సీరియస్ అవుతావ్ ఏంటి? అని సిరి అడగగా.వెళ్లి మీ వాడికి ఏం జరుగుతుందో తెలియదు కదా.హాగ్ చేయడం తప్పు అయితే మరి ఇది ఏంటి? నేను ఇంతవరకు ఏ అమ్మాయికి స్ట్రెయిట్ గా హాగ్ ఇవ్వలేదు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడతాడు షన్ను.అనంతరం సిరి ఏడుస్తూ వచ్చి షణ్ముఖ్ మంచమెక్కి ఓకే దుప్పట్లో దూరిపోయి అతని గుండె పై తల పెట్టుకుని రచ్చ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube