అదే నా దరిద్రం.. నాకు గేమ్ ఆడటం రాదు.. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్!

Shanmukh Jaswanth Commenets About Himself In Bigg Boss Show

యూట్యూబ్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉండటంతో పాటు షణ్ముఖ్ జశ్వంత్ కు లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.షణ్ముఖ్ జశ్వంత్ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ అయితే రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయనే సంగతి తెలిసిందే.

 Shanmukh Jaswanth Commenets About Himself In Bigg Boss Show-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం షణ్ముఖ్ గేమ్ సరిగ్గా ఆడటం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.టాస్కుల విషయంలో కూడా షణ్ముఖ్ జశ్వంత్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

మరోవైపు షణ్ముఖ్ ఎలిమినేషన్ లో ఉంటే రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండటంతో అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఇప్పట్లో లేదని తెలుస్తోంది.బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జశ్వంత్ కూల్ గా, కామ్ గా ఉంటున్నారు.

 Shanmukh Jaswanth Commenets About Himself In Bigg Boss Show-అదే నా దరిద్రం.. నాకు గేమ్ ఆడటం రాదు.. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న హౌస్ లోకి లోబో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.లోబో హౌస్ లోకి వచ్చినా షణ్ముఖ్ జశ్వంత్ మాత్రం పెద్దగా ఎగ్జైట్ కాకపోవడం గమనార్హం.

మరోవైపు సీక్రెట్ టాస్క్ లో గెలవడం కోసం జెస్సీ సిరి సాయం తీసుకున్నారు.

అయితే తనతో క్లోజ్ గా ఉండే సిరి జెస్సీకి సహాయం చేయడం షణ్ముఖ్ కు ఏ మాత్రం నచ్చలేదు.దాంతో సిరి, జెస్సీపై షణ్ముఖ్ జశ్వంత్ కోపంగా ఉండటం గమనార్హం.బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా టాస్క్ సరిగ్గా ఆడాలని అంటున్నారని అందరూ తనను తీసిపాడేస్తున్నారని షణ్ముఖ్ ఫైర్ అయ్యారు.

జెస్సీ కెప్టెన్ కావాలని నువ్వు సహాయం చేశావని నేను మోసపోయానని సిరితో షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.

షణ్ముఖ్ జశ్వంత్ ఈ విధంగా కామెంట్లు చేయడంతో సిరి, జెస్సీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.మంచి స్నేహితులుగా ఉండే సిరి, షణ్ముఖ్, జెస్సీ మధ్య గొడవలు జరగడం గమనార్హం.మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5కు రేటింగ్స్ క్రమంగా తగ్గుతుండటంతో బిగ్ బాస్ నిర్వాహకులు తెగ టెన్షన్ పడుతున్నారు.

#Bigg Boss Show #Jessi #Views

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube