వైరల్ ఫోటో : బిగ్ బాస్ తర్వాత తొలిసారి కలిసిన సిరి, షణ్ను..!

ఈసారి బుల్లితెరపై ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షోలో సిరి, షణ్ముఖ్ లు తెగ పాపులర్ అయ్యారు.బిగ్ బాస్ హౌస్ లో వీరు హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయారు.

 Bigg Boss5 Siri Shanmukh Jaswanth And Jessie Viral Photo, Bigg Boss5, Siri, Sha-TeluguStop.com

దీనిని చూసిన నెటిజన్లు ఇది బిగ్ బాస్ హౌసా లేక హాగ్ బాసా అంటూ దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు.సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఎంతో పాపులారిటీ సంపాదించుకుంటారు.

కానీ వీరిద్దరూ మాత్రం బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చే ముందు ఎంత క్రేజ్ తో వచ్చారో, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లే ముందు అంతే నెగిటివిటిని మూటగట్టుకొని బయటికి వెళ్లారు.

కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ వారిద్దరు తీరు మార్చుకోకుండా మరింత రెచ్చిపోవడంతో బోలెడంత నెగిటివిటిని మూట కట్టుకోవలసి వచ్చింది.

మొదట్లో టైటిల్ విన్నర్ గా షణ్ముఖ్ గెలుస్తాడని అనుకున్నారు.కానీ చివర్లో టైటిల్ రేసులో షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ గా నిలిచాడు.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సిరి, షణ్ముఖ్ జస్వంత్ మొదటిసారి కలుసుకోవడంతో ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరూ కలసి బెస్ట్ ఫ్రెండ్ జెస్సీతో వైజాగ్ రోడ్లపై సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోని జెస్సీ తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇది ఇలాంటి సోషల్ మీడియాలో సిరి గురించి మరొక వార్త చక్కర్లు కొడుతోంది.బిగ్ బాస్ హౌస్ నుంచి సిరి బయటకు వచ్చిన తర్వాత సిరి ప్రియుడు శ్రీ హాన్ ను ఒక్కసారి కూడా కలవలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube