యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తన కొత్త వెబ్ సీరీస్ ని ప్రకటించి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు.సాఫ్ట్ వేర్ డెవలపర్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ ఆ తర్వాత సూర్య వెబ్ సీరీస్ తో కూడా ప్రేక్షకులను అలరించాడు.
బిగ్ బాస్ సీజన్ 5లో రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ తన ఏటెస్ట్ వెబ్ సీరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ ని ఎనౌన్స్ చేశాడు.సుబ్బు పండు రాసిన ఈ వెబ్ సీరీస్ ని ఇన్ ఫైనైట మీడియా ప్రొడ్యూస్ చేస్తుంది.
ఈ సీరీస్ చూస్తున్నంత సేపు మీ ఫేస్ లో నవ్వు ఉంటుందనీ తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేశాడు షణ్ముఖ్.
బిగ్ బాస్ సీజన్ 5లో సిరితో అతను క్లోజ్ గా ఉండటం వల్ల బయటకు వచ్చాక తన లవర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయ్యింది.
అయితే అదే బాధలో ఉండకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి తన నెక్స్ట్ వెబ్ సీరీస్ ఎనౌన్స్ చేశాడు షణ్ముఖ్.వెబ్ సీరీస్ లతో సోషల్ మీడియాలో బీభత్సరమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న షణ్ముఖ్ ఫ్యూచర్ లో హీరోగా కూడా ప్రమోట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
అయితే ప్రస్తుతానికి మాత్రం వెబ్ సీరీస్ లతో తన హవా కొనసాగిస్తున్నాడు.ఈ వెబ్ సీరీస్ తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం పక్కా అని చెబుతున్నాడు షణ్ముఖ్.
అయితే ఈ వెబ్ సీరీస్ లో తన జోడీ ఎవరు మిగతా విషయాలన్ని మాత్రం రివీల్ చేయలేదు.