కన్నడ స్టార్‌పై కన్నేసిన శంకర్.. ఇక దుమ్ములేవాల్సిందే!

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి భారతీయుడు చిత్ర సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఇండియన్-2 అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

 Shanker Next Movie With Yash, Shanker, Yash, Kgf, Indian 2, Kollywood News-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు శంకర్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, పలుమార్లు షూటింగ్ వాయిదా పడింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.

దీంతో శంకర్ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సౌత్ ఇండయాలో కేజీఎఫ్ చిత్రంతో అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్న హీరో యశ్‌తో ఓ సినిమా చేసేందుకు శంకర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఇప్పటికే కథను కూడా రెడీ చేస్తున్న శంకర్, త్వరలోనే యశ్‌కు ఈ సినిమా కథను వినిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

అటు యశ్ కూడా ఇప్పటికే కేజీఎఫ్2 చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు యశ్ రెడీ అవుతున్నాడు.

మరి యశ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తే అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఏదేమైనా కేజీఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న యశ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్‌కు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోవడంతో, ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమా ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube