జెంటిల్ మెన్ కోసం శంకర్ అంత రిస్క్ చేశాడట.. కానీ...

తెలుగులో ప్రముఖ దర్శకుడు శంకర్ 1993వ సంవత్సరంలో దర్శకత్వం వహించిన “జెంటిల్ మెన్” అనే చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.అలాగే అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది.

 Director S Shankar About Gentleman Movie   S. Shankar, Tollywood Director, Gentl-TeluguStop.com

వచ్చీ రావడంతోనే దర్శకుడు శంకర్ ఈ జెంటిల్ మెన్ చిత్రం ద్వారా తన దర్శకత్వ  ప్రతిభ ఏమిటో చూపించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఆమధ్య దర్శకుడు శంకర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన మొదటి చిత్రం జెంటిల్ మెన్  కి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.  ఈ చిత్రంలో హీరోగా నటించినటువంటి అర్జున్ వద్దకు కథ వినిపించాలని వెళ్ళినప్పుడు అర్జున్ తాను ప్రస్తుతం సినిమా లలో నటించే మూడ్ లో లేనని కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడట.

 కానీ శంకర్ మాత్రం పట్టుబట్టి అర్జున్ కి తన కథని వినిపించడంతో అర్జున్ వెంటనే తన కథని ఓకే చేశాడట. దీంతో ఈ చిత్రంతో ఇటు దర్శకుడు శంకర్ కి ఆటు హీరో అర్జున్ కి మంచి గుర్తింపు దక్కింది.

అంతేగాక అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా సినీ చరిత్రలో అలాగే ఉన్నాయి.

అయితే ఈ రోజు ఈ చిత్ర దర్శకుడు శంకర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శంకర్ ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube