‘RC15’ అప్డేట్.. ఓల్డ్ సిటీలో సాంగ్ షూట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో అగ్ర డైరెక్టర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

 Shankars Ram Charan Starrer Rc15 Shoot Update-TeluguStop.com

మావెరిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ తో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి.

Telugu Dil Raju, Shankar, Hyderabad, Kiara Advani, Ram Charan, Rc-Movie

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15’.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాయో అందరికి తెలుసు.మరి అలాంటి శంకర్ ఆయన సినిమాలో ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

Telugu Dil Raju, Shankar, Hyderabad, Kiara Advani, Ram Charan, Rc-Movie

చిన్న సీన్స్ దగ్గర నుండి డ్యాన్స్, పాటలు, సెట్స్ ఇలా ప్రతీ విషయంలో కోట్లు ఖర్చు పెట్టి అయినా పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుతాడు.అందుకే ఈ సినిమాకు కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.మిగతా పార్ట్ కూడా శరవేగంగా చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా షూట్ అప్డేట్ బయటకు వచ్చింది.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ ను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రేపు స్టార్ట్ చేయనున్నారని అది కూడా ఒక పాటను చిత్రీకరించ బోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ పాట షూట్ తర్వాత మిగతా పార్ట్ ను వైజాగ్ ఇంకా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూట్ చేయనున్నారట.ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube