వామ్మో.. పోస్టర్ కే భారీగా ఖర్చు పెట్టిన శంకర్.. దిల్ రాజు పరిస్థితి ఏంటో?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శంకర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాలంటేనే గ్రాఫిక్స్ .

 Director Shankar Spent A Lot On Poster Dil Raju Situation, Dil Raju, Shankar, Po-TeluguStop.com

ఈయన గ్రాఫిక్స్ కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేస్తారని,ఈయన సినిమాలో ఒక పాట కోసం పెట్టే ఖర్చు ఒక చిన్న హీరోతో సినిమా మొత్తం తీయవచ్చని చాలామంది అభిప్రాయపడుతుంటారు.ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారంటే ఆ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రేక్షకులు కూడా శంకర్ సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకొని ఉంటారు.

తాజాగా డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించనున్నారు .ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” సినిమా పూర్తి కావడంతో శంకర్ సినిమాలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే బుధవారం ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభం కాక, ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు.

Telugu Rupees, Dil Raju, Graphics, Poster, Ram Charan, Ramcharan, Shankar, Tolly

ఇందులో రామ్ చరణ్ తో పాటు కియారా, శంకర్,దిల్ రాజు వంటి వారు సూట్ వేసుకుని ఫైల్స్ చేత పట్టుకొని ఎంతో అఫీషియల్ లుక్ లో కనిపిస్తున్నారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ చిత్ర బృందం నుంచి విడుదల చేసిన ఈ పోస్టర్ కోసం కేవలం దర్శకుడు కోటి 73 లక్షలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.కేవలం ఒక్క పోస్టర్ కే ఈ స్థాయిలో ఖర్చు చేస్తే సినిమా మొత్తాన్ని ఎంత బడ్జెట్ లో తెరకెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం దిల్ రాజుకు ఏ విధమైనటువంటి పరిస్థితులను కల్పిస్తుందో వేచిచూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube