శంకర్ రామ్ చరణ్ సినిమా.. ఆ సూపర్ హిట్ తో పోల్చుతున్నారు..!

శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

 Shankar Ram Charan Movie Basha Backdrop Details, Basha, Rajnikanth, Ram Charan,-TeluguStop.com

ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో చరణ్ ఒక ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ బాషా తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది.

చరణ్ కి ఈ సినిమాలో బాషా లాంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుందట.

శంకర్ చరణ్ సినిమాని బాషా రేంజ్ లో అంతకుమించి అనిపించేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.అయితే బాషా సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు దాటింది.మరి అలాంటి పాత ఫార్ములాని ఫాలో అయితే మాత్రం సినిమా రిజల్ట్ తేడా కొట్టే ఛాన్స్ ఉంది.శంకర్ తో రాం చరణ్ సినిమాకి ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాతో శంకర్ కూడా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.

Telugu Basha, Rajinikanth, Ram Charan, Ram Charan Rrr, Ramcharan, Rc, Shankar, S

RRR తో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్ ని పెంచుకున్న రామ్ చరణ్ శంకర్ సినిమాతో తప్పకుండా అదిరిపోయే హిట్ అందుకుంటాడని అంటున్నారు.శంకర్ సినిమాలో చరణ్ లుక్ కూడా మెగా ఫ్యాన్స్ ని అలరిస్తుందని తెలుస్తుంది.మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని సర్ ప్రైజ్ లు ఈ మూవీలో ఉంటాయని తెలుస్తుంది.

ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. తన సినిమాలకు ఎప్పుడూ ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తాడు.కానీ ఫస్ట్ టైం అతని ప్లేస్ లో థమన్ కి ఛాన్స్ ఇచ్చాడు శంకర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube