మరో స్టా్ర్ హీరోను లైన్‌లో పెట్టిన శంకర్?  

Shankar Next Movie With Vijay-kamal Hassan,kollywood Gossips,shankar,tamil Movie News,vijay

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా కోసం కేవలం తమిళ తంబీలే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.ఆయన తెరకెక్కించే సినిమాలు అలా ఉంటాయి కాబట్టే ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Shankar Next Movie With Vijay-kamal Hassan,kollywood Gossips,shankar,tamil Movie News,vijay Telugu Tollywood Movie Cinema Film Latest News Shankar Next Movie With Vijay-kamal Hassan Kollywood Gossips -Shankar Next Movie With Vijay-Kamal Hassan Kollywood Gossips Shankar Tamil News Vijay

తమ అభిమాన హీరోతో శంకర్ ఓ సినిమా చేస్తే బాగుండు అని ప్రతి హీరో అభిమానులు కోరుకుంటారు.అయితే శంకర్ మాత్రం పక్కా కంటెంట్‌తో సినిమాలు చేస్తూ వస్తాడు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇండియన్-2 అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.గతంలో వచ్చిన ఇండియన్ సినిమాకు ఇది సీక్వెల్.అయితే తమిళంలో ఆ సినిమా ఎలాంటి భారీ విజయాన్ని అందుకుందో తెలుగులోనూ అంతే భారీ విజయం నమోదు చేసుకుంది.ఈ సినిమా తరువాత శంకర్ మరో స్టార్ హీరోతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.

తమిళ స్టార్ హీరో విజయ్‌తో శంకర్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడంటూ తమిళ మీడియా కోడై కూస్తోంది.గతంలో బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్‌ను తమిళంలో విజయ్‌ను హీరోగా పెట్టి శంకర్ రీమేక్ చేశాడు.

అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.దీంతో విజయ్‌కు ఓ అదిరిపోయే హిట్ అవ్వాలని శంకర్ భావిస్తున్నట్లు, దానికోసమే మరోసారి విజయ్‌తో శంకర్ సినిమా చేయనున్నారని తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.మరి శంకర్-విజయ్ కాంబో నిజంగా సెట్ అవుతుందో లేదో తెలియాలంటే ఇంకాస్త సమయం ఆగాల్సిందే.

తాజా వార్తలు