ఆస్కార్ కొరియోగ్రాఫర్ ను తీసుకున్న శంకర్.. ఏ సినిమా కోసమంటే?

ఇండియన్ అగ్ర హీరోల్లో శంకర్ ఒకరు.ఈయన ప్రెజెంట్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

 Shankar Kamal Hasan Indian-2 Movie Choreographer Prem Rakshit Master Details, ,-TeluguStop.com

మరి శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ”ఇండియన్ 2” ఒకటి.ఈ సినిమా ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో షూట్ జరుపు కుంటుంది.

భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే.

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేయగా కొన్ని కారణాల వల్ల షూట్ ఆలస్యం అవుతూ వస్తుంది.ఎట్టకేలకు ఈ మధ్యనే షూట్ స్టార్ట్ అయ్యింది.

ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.

Telugu Indian, Kajal Aggarwal, Kamal Hassan, Oscar Award, Rrr, Shankar, Shankar

తాజాగా ఈ సినిమాపై మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం శంకర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది.మరి ఆ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆస్కార్ కు ఎంపికైన నాటు నాటు సాంగ్ కు కొరియోగ్రాఫ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ను తీసుకున్నట్టు టాక్.

కోలీవుడ్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.మరి ఈ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడాలి.

Telugu Indian, Kajal Aggarwal, Kamal Hassan, Oscar Award, Rrr, Shankar, Shankar

ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఇదిలా ఉండగా శంకర్ ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ తో ఆర్సీ15 సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా ఆల్ మోస్ట్ షూట్ చివరికి చేరుకుంది.దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube