శంకరా నీకు ఇంకా నిర్మాతల గోడు పట్టదా, దానికి 40 కోట్లు ఏంటీ?  

Shankar Indian 2 Make In Huge Budjet-

ఇండియా టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇండియన్‌ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న విషయం తెల్సిందే.కమల్‌ హాసన్‌ ఈ చిత్రంలో 90 ఏళ్ల వృద్దుడి పాత్రలో కనిపించబోతున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందురతున్న ఈ చిత్రంను శంకర్‌ దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.శంకర్‌ గత చిత్రాలు భారీ బడ్జెట్‌ పెట్టడం వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు.

Shankar Indian 2 Make In Huge Budjet--Shankar Indian 2 Make In Huge Budjet-

ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా శంకర్‌ మళ్లీ భారీ బడ్జెట్‌ అంటున్నాడు.

Shankar Indian 2 Make In Huge Budjet--Shankar Indian 2 Make In Huge Budjet-

2.ఓ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా భారీ బడ్జెట్‌ కారణంగా నిర్మాతలకు దాదాపుగా 100 కోట్ల మేరకు నష్టం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో శంకర్‌ అంతకు ముందు సినిమా కూడా నిరాశ పర్చిందని అందరికి తెల్సిందే.శంకర్‌ ఒక గొప్ప దర్శకుడు అంటూ ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగులుతున్నాయి.

అయినా కూడా నిర్మాతల గోడు పట్టనట్లుగా శంకర్‌ వ్యవహరిస్తున్నాడు.

మరోసారి శంకర్‌ తన మార్క్‌ చూపించేందుకు ఇండియన్‌ 2 చిత్రంలోని ఒక సెట్‌ కోసం ఏకంగా 40 కోట్లు ఖర్చు చేస్తున్నాడు.ఒక సెట్‌ కోసం అంత ఖర్చు ఏంటీ అంటూ అంతా నోరు వెళ్లబెడుతున్నారు.అసలు స్టార్‌ హీరోల భారీ బడ్జెట్‌ చిత్రాలకు కూడా అంత ఖర్చు చేయడం లేదు.

అలాంటిది 40 కోట్లు ఒక్క సెట్‌ కోసం అంటే ఇది మరీ ఓవర్‌ అనిపించడం లేదా అంటూ శంకర్‌ ను నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.శంకర్‌ నిర్మాతల గురించి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా సినిమా బడ్జెట్‌ పెంచేయడం కరెక్ట్‌ కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.