సాహో నుంచి తప్పుకున్న సంగీత దర్శకులు  

సాహో నుంచి తప్పుకున్న సంగీత దర్శకులు..

Shankar-ehsaan-loy Quits Prabhas\' Saaho-director Sujith,shankar-ehsaan-loy,tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని సాంగ్స్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ పని చేస్తున్నారు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు సంగీత దర్శకుల టీం సాహో సినిమా నుంచి బయటకి వచ్చారు..

సాహో నుంచి తప్పుకున్న సంగీత దర్శకులు-Shankar-Ehsaan-Loy Quits Prabhas' Saaho

ఈ ప్రాజెక్టు నుంచి వారు తప్పుకున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ టీం సాహో సినిమా కోసం దర్శకుడు సుజిత్, హీరో ప్రభాస్ అంచనాలకి తగ్గ బీట్స్ ఇవ్వలేకపోవడం వలన వారిని తప్పించినట్లు తెలుస్తుంది. అయితే మ్యూజిక్ సిట్టింగ్ లో విభేదాల కారణంగా వారే తప్పుకున్నారు అని బాలీవుడ్ లో వినిపిస్తుంది.

ఏది ఏమైనా సాహో సినిమా నుంచి వారు తప్పుకోవడం ఇప్పుడు నిర్మాతలు మరో టాలెంటెడ్ మ్యూజిక్ దర్శకుడు కోసం చూస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక రన్ రాజా రన్ తో సుజిత్ కి ఫస్ట్ హిట్ ఇచ్చిన గిబ్రాన్ ని మళ్ళీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.