జెంటిల్‌మేన్‌ 2 రాబోతున్నాడు

అర్జున్‌, మధుబాల జంటగా 1993లో వచ్చిన ‘జెంటిల్‌మేన్‌’ సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌ అయిన విషయం తెల్సిందే.తెలుగుతో పాటు హిందీ ఇతర భాషల్లో కూడా విడుదల అయిన జెంటిల్‌మేన్ సినిమా అన్ని చోట్ల కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Shankar Direction Arjun Starrer Gentleman To Get A Sequel, Arjun, Shankar, Gentl-TeluguStop.com

అర్జున్‌ ను సౌత్‌ ఇండియాలోనే స్టార్‌ హీరో‌గా ఆ సినిమా నిలిపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తమిళ సినీ చరిత్రలో అంతకు ముందు వరకు ఉన్న కలెక్షన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసింది.

భారీ వసూళ్లతో పాటు అందరి మన్ననలు పొందిన జెంటిల్‌మేన్‌ సినిమాకు పలు అవార్డులు మరియు రివార్డులు కూడా వచ్చాయి.జెంటిల్‌మేన్‌ సినిమాకు సీక్వెల్‌ అంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి.

ఇన్నాళ్లకు ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది.నిజమే మా జెంటిల్‌మేన్‌ మళ్లీ రాబోతున్నాడు అంటూ నిర్మాత కె టి కుంజుమోన్‌ ప్రకటించాడు.

జెంటిల్‌మేన్ వచ్చి 27 సంవత్సరాలు అయిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీక్వెల్‌ ను ప్రకటించాడు.ఈ సీక్వెల్‌ కోసం ఆయన కొత్త బ్యానర్‌ ను ప్రారంభించాడు.జెంటిల్‌మేన్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ పై జెంటిల్‌మేన్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేసేలా ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌ లో తెరకెక్కించబోతున్నాం అన్నాడు.

అయితే ఈ సీక్వెల్‌ కు శంకర్‌ దర్శకత్వం వహిస్తాడా లేదా అనేది సస్పెన్స్‌ గా ఉంది.శంకర్‌ దర్శకత్వంలో సినిమా అంటే బడ్జెట్‌ వంద కోట్లలో కావాల్సి ఉంటుంది.

కాని ఈ నిర్మాత వద్ద అంత స్తాయి లేదని కనుక మరో దర్శకుడితో ఈ సీక్వెల్‌ ను చేసే అవకాశం ఉందని అంటున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఏడాది చివరి వరకు వెళ్లడిస్తామని అంటున్నారు.

ఆ తర్వాత సినిమాను కూడా పట్టాలెక్కించనున్నారు.శంకర్‌ దర్శకత్వంలో ఈ సీక్వెల్‌ కాకుంటే వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube