పొద్దున చెప్పాం.. సాయంత్రానికి నిజం చేసిన శంకర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనే అంశంపై తెలుగుస్టాప్.కామ్ ముందునుండీ పక్కా సమాచారాన్ని అందించే దిశగా వెళ్తూ వచ్చింది.

 Shankar Confirms Movie With Ram Charan, Shankar, Ram Charan, Dil Raju, Tollywood-TeluguStop.com

అయితే చరణ్ నెక్ట్స్ మూవీ వెంకీ కుడుముల, గౌతమ్ తిన్నూరి వంటి దర్శకులతో ఉండొచ్చనే వార్త సోషల్ మీడియాలో పెద్దగా వినిపించింది.కానీ కేవలం తెలుగుస్టాప్.కామ్ మాత్రమే చరణ్ సినిమా ఎవరితో ఉండబోతుందో అనే విషయానికి సంబంధించి ఫిబ్రవరి 12న ఉదయం ఓ వార్తను ప్రచురించింది.ఇప్పుడు అదే నిజం అయ్యింది.

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుగుస్టాప్.కామ్ తెలిపింది.అయితే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఇప్పుడు ఇదే చిత్రాన్ని దర్శకుడు శంకర్ స్వయంగా కన్ఫం చేశాడు.

తన నెక్ట్స్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్నట్లు శంకర్ స్వయంగా ప్రకటించాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ఆయన ప్రకటించాడు.

దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులు అవాక్కయ్యారని చెప్పాలి.

శంకర్ చిత్రాలకు కేవలం తమిళనాటే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా అదిరిపోయే క్రేజ్ నెలకొంటుంది.

అలాంటి స్టార్ డైరెక్టర్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలాంటి కథను ఓకే చేశాడా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఇక ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యుంటుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్‌లో చరణ్ ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుంటున్నాడో మనకు తెలిసిందే.ఇక శంకర్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాతో సోలోగా పాన్ ఇండియా రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని చరణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరి ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube