రామ్ చరణ్ కోసం శ్రద్ధా కపూర్ లేదంటే కియరా అద్వానీని దించనున్న శంకర్

సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

 Shankar Concentrate On Bollywood Beauties For Ram Charan-TeluguStop.com

ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.భారతీయుడు సీక్వెల్ సినిమా వివాదం తాజాగా కోర్టు వరకు వెళ్ళడంతో రామ్ చరణ్ సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలా మందికి వ్యక్తం అయ్యాయి.

అయితే కోర్టు నుంచి శంకర్ ని అనుకూలంగా తీర్పు రావడంతో ఈ సినిమాకి సంబందించిన వర్క్ యధావిధిగా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ అనే టాక్ వినిపిస్తుంది.

 Shankar Concentrate On Bollywood Beauties For Ram Charan-రామ్ చరణ్ కోసం శ్రద్ధా కపూర్ లేదంటే కియరా అద్వానీని దించనున్న శంకర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అలాంటిదేం లేదని పూర్తిగా కొత్త కథతో ఈ సినిమాని శంకర్ చేస్తున్నట్లు ఆ చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా కోసం ప్రస్తుతం శంకర్ వేట కొనసాగిస్తున్నాడు.పాన్ ఇండియా సినిమా కావడంతో ఇందులో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామలని దర్శకుడు పరిశీలిస్తున్నాడు.ఇందులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.వారిలో శ్రద్ధా కపూర్, కియరా అద్వానీ ఉన్నారు.ఇప్పటికే కియరా అద్వానీ రామ్ చరణ్ కి జోడీగా వినయ విదేయ రామా సినిమాలో నటించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.అలాగే శ్రద్ధా కపూర్ సాహూ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అలాగే శ్రద్ధా కపూర్ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లలో ఒకరుగా ఉన్నారు.ఈ నేపధ్యంలో వీరిద్దరిలో ఒకరిని ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తుందని టాక్ నడుస్తుంది.

ఈ నెలలోనే హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

#June #Megastar #Dil Raju #Shankar #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు