స్టార్‌ డైరెక్టర్‌ మరియు స్టార్‌ కమెడియన్‌ మద్య మద్య కుదిరిన రాజీ

చాలా సంవత్సరాలుగా దర్శకుడు శంకర్‌ మరియు కమెడియన్‌ వడివేలు మద్య నెలకొన్న వివాదంకు ఫుల్‌ స్టాప్ పడింది.ఎంతో మంది నిర్మాతలు వీరద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

 Shankar And Vadivelu Got Compromised-TeluguStop.com

కాని తాజాగా ఒక నిర్మాత చేసిన ప్రయత్నం తో వీరిద్దరి మద్య వివాదం సమసి పోయింది.వడివేలు వల్ల నష్టపోయిన అమౌంట్ విషయంలో శంకర్‌ చేసిన పోరాటం ముగిసిపోయింది.

కోర్టు నుండి మొదలుకుని నిర్మాతల మండలి వరకు ఎన్నో చోట్ల వీరి గొడవ సాగింది.ఎట్టకేలకు వీరి గొడవ సమసి పోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.

 Shankar And Vadivelu Got Compromised-స్టార్‌ డైరెక్టర్‌ మరియు స్టార్‌ కమెడియన్‌ మద్య కుదిరిన రాజీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇద్దరు కూడా లెజెండ్స్ అవ్వడం వల్ల ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కాక చాలా మంది కూడా తటస్థంగా ఉండి పోయారు.

ఇంతకు వీరి మద్య గొడవ ఎందుకు వచ్చిందంటే.

చాలా ఏళ్ల క్రితం హింసించే 23వ రాజు పులకేసి వచ్చింది.ఆ సినిమా తో వడివేలు హీరో గా పరిచయం అవ్వగా శంకర్ నిర్మించాడు.

శంకర్‌ నిర్మాణం లో వచ్చిన ఆ సినిమా సక్సెస్‌ అవ్వడం తో సీక్వెల్‌ ను మొదలు పెట్టారు.కాని సీక్వెల్‌ షూటింగ్ సగం పూర్తి అయిన తర్వాత కథ బాగా లేదు అంటూ వడివేలు సినిమా నుండి తప్పుకున్నాడు.

దాంతో శంకర్ కు భారీ నష్టం వచ్చింది.సినిమా పూర్తి చేయక పోవడం వల్ల తనకు చాలా నష్టం వచ్చిందని.

కనుక తనకు ఆ నష్టంను భర్తీ చేయాలంటూ శంకర్ విజ్ఞప్తి చేస్తూ నిర్మాతల మండలి ముందుకు వెళ్లాడు.

Telugu Ban On Vadivelu, Compromised, Himsinche 23 Pulakesi Movie, Kollywood Film, Producer, Sequel, Shankar, Shankar And Vadivel, Tamil Film, Vadivel-Movie

కాని అక్కడ ఆయనకు నిరాశే మిగిలింది.ఇద్దరి మద్య గొడవ జరిగిన నేపథ్యంలో పలువురు నిర్మాతలు దూరంగా ఉన్నారు.నిర్మాతల మండలి నిర్ణయంతో వడివేలు పై కొన్నాళ్లు బ్యాన్‌ కొనసాగింది.

కొన్నాళ్ల పాటు బ్యాన్ కొనసాగిన తర్వాత ఆయన పై బ్యాన్ తొలగించారు.అయినా కూడా సినిమా లకు దూరంగా ఉంటున్నాడు.

స్టార్‌ కమెడియన్‌ మళ్లీ నటించేందుకు గాను ఓకే చెప్పాడు.అందుకే ఇప్పుడు శంకర్‌ తో రాజీకి సిద్దం అయ్యాడు.

#Ban On Vadivelu #Shankar #Compromised #Vadivel #Sequel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు