చరణ్ ప్రాజెక్ట్ కొత్త పోస్టర్ రిలీజ్.. శంకర్ మ్యాజిక్ స్టార్ట్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.

 Shankar And Ram Charan Movie New Poster Released, Ram Charan, Shankar, Rrr, Dire-TeluguStop.com

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అందులోను ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ ఇద్దరు కనిపించి అభిమానులను కనువిందు చేయబోతున్నారు.

ఇక రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో చిరంజీవి సరసన కాజల్, చరణ్ కు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఇక త్వరలోనే ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ ను ఈ రోజు భారీ లెవల్లో లాంచ్ చేయబోతున్నారు.

Telugu Acharya, Dil Raju, Shankar, Kiyara Advabni, Poster, Pan India, Rajamouli,

ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ను పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నట్టు టాక్.ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ఒక సాలిడ్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు.ఈ పోస్టర్ ఎంతో ఆసక్తిని రేపుతోంది.

అంతేకాదు చాలా రోజుల తర్వాత శంకర్ మ్యాజిక్ ఈ పోస్టర్ లో కనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Telugu Acharya, Dil Raju, Shankar, Kiyara Advabni, Poster, Pan India, Rajamouli,

ఇది వెంటనే చుస్తే రోబో లాగా అనిపిస్తుంది కానీ ఇందులో శంకర్ పనితనం కనిపిస్తుంది.ఈ పోస్టర్ లో రామ్ చరణ్ తో పాటు శంకర్ కియారా అద్వానీ కూడా కనిపిస్తున్నారు.అంతేకాదు ఈ పోస్టర్ లో ఒకే కాస్ట్యూమ్ తో సినిమా క్యాస్ట్ మొత్తం ఈ ఒక్క పోస్టర్ లోనే కనిపిస్తున్నారు.

మొత్తానికి ఒక్క పోస్టర్ తో ఈ సినిమాను వేరే లెవల్లో ప్రెసెంట్ చేసాడు శంకర్.మరి నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube