విండీస్ హిట్టర్ విధ్వంసం... ఫైనల్లో జమైకా తలైవాస్....

వెస్టిండీస్ క్రికెట్ టీం లో భారీ సిక్సర్ల తో విధ్వంసం సృష్టించగల క్రికెటర్లు ఉన్నారు.క్షణాల్లో ఓడిపోయే మ్యాచ్ ను కూడా గెలిపించగల సత్తా ఉన్న వారు చాలా మంది ఉన్నారు.

 Shamarh Brooks Unbeaten Century In Cpl 2022 Details, Shamarh Brooks, Shamarh Bro-TeluguStop.com

ఈ దేశ క్రికెటర్లు ప్రతి దేశంలో జరిగే టీ20 లీగ్ లలో ఎక్కువగా ఆడుతూ ఉంటారు.ఇలాంటి టి20 కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక విండీస్ పవర్ హిట్టర్ సెంచరీ చేసి తన టీం అయినా జమైకా తలైవాస్ ను ఫైనల్ కి చేర్చాడు.

బుధవారం రాత్రి గయానా అమెజాన్‌ వారియర్స్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జమైకా తలైవాస్‌ 37 పరుగులతో విజయాన్ని అందుకుంది.

విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ షమ్రా బ్రూక్స్‌ కీలక సమయం లో సెంచరీ తో మెరుపు బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన జమైకా తలైవాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీస్కోరు చేసింది.షమ్రా బ్రూక్స్‌(52 బంతుల్లో 109 నాటౌట్‌, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా, రోవ్‌మెన్‌ పావెల్‌ 23 బంతుల్లో 37 పరుగులు చేశాడు.

చివర్లో ఇమాద్‌ వసీమ్‌ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

Telugu Cpl, Gayana Warriors, Shamarh Brooks, Shamarhbrooks, Cricketer-Sports New

గయానా వారియర్స్‌ బౌలర్లలో రొమెరియో షెపర్డ్‌ రెండు వికెట్లు, తాహిర్‌, ఓడియన్‌ స్మిత్‌లు చెరొక వికెట్‌ తీశారు.అనంతరం బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసింది.కీమో పాల్‌ 56 పరుగుల తో టాప్‌ స్కోరర్‌ షెయ్‌ హోప్‌ 31 పరుగులు, ఓడెన్‌ స్మిత్‌ 24 పరుగులు చేశారు.

జమైకా తలైవాస్‌ బౌలర్ల లో ఇమాద్‌ వసీమ్‌, క్రిస్‌ గ్రీన్‌లు చెరో రెండు వికెట్లు, మహ్మద్‌ ఆమిర్‌, ఫాబియెన్‌ అలెన్‌, రోవ్‌మెన్‌ పావెలు తలా ఒక వికెట్‌ తీశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube