అర్జున్ రెడ్డి బేబీని ఆదుకునేవారే లేరా?  

Shalini Pandey Chances Gone-shalini Pandey,tollywood Gossips,vijay Devarakond

అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన బ్యూటీ షాలిని పాండే. ఆ సినిమా సక్సెస్ ఒక్కసారిగా అవకాశాలన్నీ ఆమె కాళ్ల దగ్గరకు వచ్చేలా చేసింది. అయితే తొందరపడకుండా నెమ్మదిగా కెరీర్ ను సెట్ చేసుకోవాలని అనుకున్న షాలినిని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు..

అర్జున్ రెడ్డి బేబీని ఆదుకునేవారే లేరా? -Shalini Pandey Chances Gone

అర్జున్ రెడ్డిలో బేబీ అంటూ ఎంతో క్యూట్ గా కుర్రాళ్ళ మనసును దోచేసిన షాలిని అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. గ్లామర్ రోల్స్ కూడా చేస్తానని ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తూనే ఉంది. అలా కూడా ఎవరు ఆదుకోవడం లేరు. అమ్మడు కేవలం అర్జున్ రెడ్డిలో మాత్రమే పనికొచ్చిందా? వేరే క్యారెక్టర్స్ లో సెట్ కాదా అనే సందేహాలు వెలువడుతున్నాయి.

మొన్న వచ్చిన 118కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో డిస్కర్షన్ లిస్ట్ లో ఉన్న ఆఫర్స్ కూడా పోయినట్లు టాక్ వస్తోంది. ఇక బేబీ చేతిలో ప్రస్తుతం సైలెన్స్ అనే సినిమాతో పాటు మరో రెండు తమిళ్ సినిమాలు ఉన్నాయి. వాటిలో కూడా సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. మరి ఈ బేబీ సోలో హిట్ అందుకొని స్టార్ హీరోలతో ఎప్పుడు జతకడుతుందో చూడాలి..