ప్రభాస్‌ హీరోయిన్‌ పెళ్లి వార్తలు ఆమె తండ్రి విచిత్రమైన స్పందన  

Shakthi Kapoor Cooments On His Daughter-

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న శ్రద్దా కపూర్‌ సౌత్‌లో ఆఫర్లు వస్తే కంటిన్యూ అవ్వడంకు అభ్యంతరం లేదు అంటూ ఇటీవలే చెప్పుకొచ్చింది.తాజాగా ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Shakthi Kapoor Cooments On His Daughter--Shakthi Kapoor Cooments On His Daughter-

గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యిందంటూ పుకార్లు షికార్లు చేశాయి.

Shakthi Kapoor Cooments On His Daughter--Shakthi Kapoor Cooments On His Daughter-

ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు అయితే వస్తున్నాయి.కాని ఈ ఏడాదిలోనే వీరి వివాహం అని, త్వరలోనే నిశ్చితార్థం అంటూ వార్తలు రావడంతో అంతా కూడా అవాక్కయ్యాడు.

మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రధ్దా కపూర్‌ తండ్రి శక్తి కపూర్‌ స్పందించాడు.తన కూతురు పెళ్లి అంటూ మీడియాలో వార్తలు చూశాను.ఎప్పుడు ? ఎక్కడో కూడా చెప్పండి.అలాగే నా కూతురు పెళ్లికి దయచేసి నన్ను కూడా పిలవండి అంటూ శక్తి కపూర్‌ విచిత్రంగా స్పందించాడు.

శక్తి కపూర్‌ వ్యాఖ్యలతో అసలు విషయంపై క్లారిటీ వచ్చింది.పెళ్లి ఆలోచనే లేదని, ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా మంచి స్టేటస్‌ను దక్కించుకున్న ఈ అమ్మడు పెళ్లి అంటూ తప్పటడుగులు వేయదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సాహో చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా మరో రెండు హిందీ సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.