వైరల్ వీడియో: అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ ఏకంగా..?!

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.అందులోనూ భారత్ లో ప్రతి గల్లీలో ఓ క్రికెట్ ఆడేవారు కచ్చితంగా ఉంటారు.

 Shakib Al Hasan Kicks Throws Stumps Arguing Umpire-TeluguStop.com

ఇక ఐపీఎల్, వర్డ్ కప్ లాంటిది వస్తే చాలు తిండీ నీళ్లు తగ్గించి మరీ టీవీలకు అతుక్కుపోయి ఉంటారు.అందుకే క్రికెట్ కు చాలా మంది అభిమానులున్నారు.

ఒకప్పుడు క్రికెట్ అంటే పాకిస్తాన్, భారత్ జట్లు తలపడి తీరుతారు.

 Shakib Al Hasan Kicks Throws Stumps Arguing Umpire-వైరల్ వీడియో: అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ ఏకంగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ మ్యాచ్ చాలా ఆసక్తిగా ఉంటుంది.ఇలా ప్రపంచంలో చాలా జట్లు నువ్వా నేనా అంటూ తలపడుతుంటాయి కూడా.ఇకపోతే క్రికెట్ ఆడేవారు చాలా స్పోర్టీవ్ గా ఉంటారు.

ఎటువంటి అవమానం జరిగినా చాలా సామరస్యంగా డీల్ చేస్తుంటారు.ఆటలో గెలిచినా ఓడినా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు.

అది ఆటలో ప్రధాన లక్షణం.అయితే ఇప్పుడు కొన్ని సందర్భాల్లలో క్రికెటర్లకు విపరీతమైన కోపం వస్తుంది.

చాలా మంది ఆ టైంలో తమ పని తాము చేసుకుని ఉండిపోతారు.ఇక ఇంకొందరు అయితే ఏదో ఒకటి చేసే దాకా ఊరుకోరు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌‌రౌండర్ షకీబ్ అల్ హసన్ చేయకూడని పని చేశాడు.క్రికెటర్లు చేయకూడని పనిని చేశాడు.తాను వేసిన బౌల్ కు అంపైర్ సరైన నిర్ణయం ప్రకటించలేదని వికెట్లను కాలితో తన్నాడు.

అక్కడితో ఆగలేదు.అంపైర్ పై తిట్ల వర్షం కురిపించాడు.

క్రికెటర్ దురుసుగా ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అబహాని లిమిటెడ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్‌ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న షకీబ్ అల్ హసన్ ఇలా ప్రవర్తించడం పలువురిని ఆగ్రహానికి గురి చేస్తోంది.తాను వేసిన బౌల్ అవుట్ అని వాదించినా అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఆగ్రహానికి లోనయ్యాడు.ప్రస్తుతం తన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

#Shakib Al Hasan #Kicks #Arguing Umpire #Stumps #Throws

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు