అప్పుల్లో ఉన్నా... ప్లీజ్ నా సినిమాని చూడమని కోరుతున్న షకీలా...

ఒకప్పుడు తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శృంగార తార షకీలా గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.ఈ మధ్య నటి షకీలా శృంగార తరహా సినిమాలలో నటించడం మానేసి దర్శకత్వం, నిర్మాణం తదితర అంశాలపై దృష్టి పెట్టింది.

 Shakeela, Telugu Veteran Actress, Ladies Not Allowed, July 20th Release, Tollywo-TeluguStop.com

ఇందులో భాగంగా “లేడీస్ నాట్ అలౌడ్” అనే అడల్ట్ తరహా చిత్రాన్ని తెరకెక్కించింది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసే వీలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవలే నటి షకీలా తెలిపింది.

దీనికి తోడు సినిమా కోసం చేసినటువంటి అప్పులకి రోజురోజుకీ వడ్డీ పెరిగి పోతుండడంతో తమ డబ్బు తమకి తిరిగి చేయాలని అప్పు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి తెస్తున్నారని అందువల్ల ఈ చిత్రాన్ని ఈ నెల 20వ తారీఖున ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.అయితే ఈ చిత్రాన్ని చూడాలంటే వీక్షకులు ముందుగా  50 రూపాయలు చెల్లించాలని ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిం.

అలాగే ఈ చిత్రం కోసం చాలా చోట్ల అప్పులు చేశానని కాబట్టి దయచేసి ఈ చిత్రాన్ని చూసి తనకు ఆర్ధిక సహాయం చేయాలంటూ నటి షకీలా అభిమానులను అర్థించింది.దీంతో కొందరు నెటిజన్లు ఒకప్పుడు లక్షల పారితోషికం తీసుకునేటువంటి షకీలా ఇంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొ వడానికి  ఒకప్పుడుడబ్బు విషయంలో తను చేసినటువంటి విచ్చల విడితనమే కారణమని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube