సెన్సార్ వాళ్లను రఫ్ఫాడించిన షకీలా.. అది కావాలని అడిగారట!

అడల్ట్ సినిమాలతో సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీని ఒకప్పుడు షేక్ చేసిన బ్యూటీ షకీలా.ఓ దశలో సౌత్ ఇండియా స్టార్ హీరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఘనత షకీలాకు ఉందంటే, అప్పట్లో ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం అవుతోంది.

 Shakeelafires On Censor Board Members-TeluguStop.com

అయితే సమయం గడిచే కొద్ది ఆమె సినిమాలు తగ్గిపోయాయి.కానీ ఆమెకు ఇప్పటికీ ఫాలోయింగ్ ఉందనే మాట వాస్తవం.

కాగా ఆమె నటించిన తాజా చిత్రం ‘లేడీస్ నాట్ అలవ్డ్’కు సెన్సార్ బోర్డు పెద్ద అడ్డంకిగా మారిందని షకీలా వాపోయింది.

షకీలా నటించి, ప్రొడ్యూ్స్ చేసిన ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు రెండు సార్లు రిజెక్ట్ చేశారు.

దీనికి అసలు కారణం ఏమిటో తనకు తెలపాలని షకీలా డిమాండ్ చేస్తోంది.తాను నిర్మించిన ఈ సినిమా అడల్ట్ కామెడీ అని ముందే చెప్పానంటోంది షకీలా.సెన్సార్ బోర్డులో కొందరు సభ్యులు తనపట్ల కావాలనే ఈ చర్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.తనను కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది.

చిన్న నిర్మాతలు డబ్బులు డిమాండ్ చేసే సెన్సార్ బోర్డు సభ్యులు పెద్ద నిర్మాతల వద్ద ఎందుకు డిమాండ్ చేయరు అంటూ ఆమె ప్రశ్నించింది.కాగా తనను డబ్బులు డిమాండ్ చేసిన వారి రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన షకీలా, వారి మంచికోసం అవి బయటపడకుండా చూసుకోవాలని హెచ్చరించింది.

మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube