తన బయోపిక్ మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..

షకీలా అంటే తెలియని వారు దాదాపుగా ఉండరేమో.అంతగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

 Shakeela Sensational Comments On Her Biopic, Shakeela, Sensational Comments, Bio-TeluguStop.com

దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆమె దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీపై తనదైన హవా చూపించింది.వరస పెట్టి బి గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

ఒకానొక సమయంలో ఈమె స్టార్ హీరో సినిమాలతో కూడా పోటీ పడేది.

షకీలా సినిమాలు థియటర్ లో రిలీజ్ అయితే అన్ని థియటర్స్ హౌస్ ఫుల్ అయ్యేవి.

స్టార్ హీరోలు కూడా షకీలా సినిమాలు రిలీజ్ అవుతుంటే తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు.సౌత్ లోనే కాకుండా ఈమె సినిమాలకు హిందీలో కూడా విపరీతమైన ఆదరణ లభించేది.

ఈమెకు అన్ని రకాల వయసుల వారు అభిమానులుగా ఉండేవారు.

ఒకానొక సమయంలో ఈమె భారతదేశంలో ఏకైక శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఈమె ఇప్పటికి పెళ్ళి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.అందుకు ఆమె ప్రేమ విఫలలే కారణం.

షకీలా ఆరేడుమందితో ప్రేమాయణం సాగించిందని ఆమె స్వయంగా వెల్లడించింది.అయితే ఏ వ్యక్తి కూడా పెళ్లి చేసుకోవడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదట.

Telugu Biopic, Dirty Picture, Love Failure, Sensational, Shakeela, Silk Smitha,

అంతేకాదు షకీలా తన ఆస్తుల విషయంలో కూడా మోసపోయిందట.అయితే అంత పేరు ప్రతిష్టలు సంపాదించిన షకీలా ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకుని, ఆఫర్లు లేక కొంతకాలంగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది.తాజాగా యూట్యూబ్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన బయోపిక్ గా వచ్చిన షకీలా సినిమా గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.

అసలు తన బయోపిక్ గా ఒక సినిమా తీస్తున్నట్లు కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఆ సినిమాలో చాలా సన్నివేశాలు వాస్తవాలు కాదు.సినిమా కోసం చాలా సన్నివేశాలు కల్పితంగా తీశారు.

అసలు ఆ సినిమా నా బయోపిక్ గా అనిపించలేదు అని షాకింగ్ కామెంట్స్ చేసారు.

అంతేకాదు సిల్క్ స్మిత బయోపిక్ గా వచ్చిన దర్టీ పిక్చర్ లో కూడా నాకు తనకి పోటీ ఉందని సినిమాలో చూపించారు.

కానీ అది వాస్తవం కాదు.ఆమె ఎక్కడ ? నేనెక్కడ ? అసలు ఆమె నాకు పోటీనే కాదు.ఆమె నాకన్నా పెద్ద నటి.ఆమె నాకు ఆదర్శం.అంటూ షకీలా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube