ఓటీటీలో షకీలా సినిమా.. కుటుంబంతో సహా చూడొచ్చట!  

Shakeela Movie To Release In OTT, Shakeela, Adult Star, OTT, Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram, Tollywood News - Telugu Adult Star, Ott, Shakeela, Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram, Tollywood News

అడల్ట్ స్టార్‌గా ఒకప్పుడు దక్షిణాది చిత్ర రంగాన్ని ఊపేసిన షకీలా, ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలు చేస్తూ నెట్టుకొస్తుంది.90లలో ఆమె సినిమా వస్తుందంటే, స్టార్ హీరోల సినిమాలు సైతం రిలీజ్‌ను వాయిదా వేసుకునే వారు.అంటే ఆమె సినిమాకు అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.ఇక షకీలా చేసిన అడల్ట్ సినిమాలు ఆమెకు ఎంత పేరును తీసుకొచ్చాయో, రెగ్యులర్ సినిమాలకు ఆమెను అంతే దూరం చేశాయి.

 Shakeela Movie To Release In Ott

కాగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.షకీలా మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న ‘షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాలో షకీలా ఓ రచయిత్రిగా మనకు కనిపిస్తుంది.పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఓటీటీలో షకీలా సినిమా.. కుటుంబంతో సహా చూడొచ్చట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను మెప్పించగా, రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ సినిమా షకీలా అభిమానులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సి.హెచ్.వెంకట్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మధు పొన్నస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.అయితే ఏ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పై దీన్ని రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.వీఎన్ సతీష్ డైరెక్ట్ చేస్తు్న్న ఈ సినిమాలో షకీలాతో పాటు విక్రాంత్, పల్లవి ఘోష్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరి ఈ అడల్ట్ స్టార్ చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తారో చూడాలి.

#OTT #Adult Star #Shakeela

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shakeela Movie To Release In Ott Related Telugu News,Photos/Pics,Images..