సెన్సార్ బోర్డును షేక్ చేసిన షకీలా

ఒకప్పుడు దక్షిణ భారతంలో అడల్ట్ స్టార్‌గా కుర్రకారుకు నిద్రలు లేకుండా చేసిన బొద్దు గుమ్మ షకీలా, ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఆ సమయంలో సౌత్ ఇండియాలోని టాప్ సూపర్ స్టార్స్‌ను మించిన రెమ్యునరేషన్‌ను షకీలా తీసుకునేదంటే, ఆమెకు ఎలాంటి క్రేజ్, ఫాలోయింగ్ ఉండేదో ఊహించుకోవచ్చు.

 Shakeela Movie Gets Clean U Certificate, Shakeela, Adult Star, Tollywood News, C-TeluguStop.com

ఇక షకీలా సినిమా వస్తుందంటే, అప్పట్లో ఏ గ్రేడ్ థియేటర్స్ ముందు జాతర వాతావరణం కనిపించేది.

కానీ ఇదంతా ఒక్కప్పటి మాట.ఇప్పుడు ఈ శృంగార తార వయసు మీదపడటంతో కేవలం క్యారెక్టర్ పాత్రలు మాత్రమే చేస్తూ నెట్టుకొస్తుంది.ఇక షకీలా నటించిన సినిమాలకు సెన్సార్ బోర్డు వారు కళ్లు మూసుకుని సర్టిఫికెట్ జారీ చేసేవారు.

కానీ వారిని అవాక్కయ్యేలా చేస్తూ తాజాగా షకీలా నటించిన సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకుంది.‘షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోందట.

ఈ సినిమాలో ఎక్కడా కట్ చేయకుండానే సెన్సార్ బోర్డు వారు యూ సర్టిఫికెట్ జారీ చేయడంతో షకీలా కెరీర్‌లోనే ఇది ఆమె తొలి యూ సర్టిఫికెట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.ఇక పెద్ద సినిమాలకే దిక్కు లేని ఈ సమయంలో ఇలాంటి చిన్న సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ చేయడం కష్టమని భావించిన చిత్ర యూనిట్, ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఏదేమైనా యూ సర్టిఫికెట్ అందుకున్న షకీలా సెన్సార్ బోర్డు వారిని షేక్ చేసిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube