షకీలాకి ఓ కూతురు కూడా ఉంది... ఆమె ఎవరో తెలుసా?

అడల్ట్ కంటెంట్ సినిమాలతో శృంగారతారగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి షకీలా.తెలుగమ్మాయి అయిన కూడా మలయాళీ బిగ్రేడ్ సినిమాలతో సౌత్ ప్రతి ఒక్కరి దృష్టి తనపై పడేలా చేసుకున్న షకీలా ఒకానొక సమయంలో అక్కడి స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చే స్థాయికి తమ ఇమేజ్ ని పెంచుకుంది.

 Shakeela Introduced Her Daughter Milla, Tollywood, Kollywood, Cock With Komali-TeluguStop.com

అయితే ఆమె చేసిన శృంగార చిత్రాల వలన యువత చెడిపోతున్నారు అంటూ అక్కడ ఆమె సినిమాలని బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా షకీలా కెరియర్ క్రిందకి పడిపోయింది.రొమాంటిక్ చిత్రాలతో యువత మనసులు దోచిన షకీలా ప్రస్తుతం ఆర్ధికంగా భాగా చితికిపోయింది.

అప్పుడప్పుడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చిన డబ్బుతో జీవితాన్ని నెట్టుకొస్తుంది.రీసెంట్ గా హిందీలో రిచాచద్దా మెయిన్ లీడ్ లో షకీలా బయోపిక్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

అనుకున్న స్థాయిలో హిట్ కాకుండా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈమె తమిళంలో బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌వుతున్న కుక్ విత్ కోమ‌లిలో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు ష‌కీలా.

అందులో పాల్గొన‌డం ద్వారా ఆమెపై అంద‌రిలో అభిప్రాయం మారిపోయింది.మ‌రోవైపు కుకింగ్‌లో దూసుకుపోతున్న షకీలా ఈ సీజ‌న్ విన్న‌ర్ గా నిలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఆమెకి ఒక కూతురు కూడా ఉందనే విషయం తాజాగా బయటకొచ్చింది.పెళ్లి చేసుకోకపోయినా షకీలా ఒక ట్రాన్స్ జెండర్ అమ్మాయిని దత్తత తీసుకుంది.ఆమె పేరు మిల్లా.ఆమె బాధ్య‌త‌ల‌ను ష‌కీలానే చూసుకుంటున్నారు.

ఇక కుక్ విత్ కోమ‌లి ఎపిసోడ్‌లో ఆమెను షకీలా అంద‌రికీ ప‌రిచ‌యం చేశారు.ఇక మిల్లా కూడా తల్లి బాటలోనే సినిమాలలో నటిగా సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే మోడలింగ్ లో కూడా మిల్లా ఎంట్రీ ఇచ్చినట్లు బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube