ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.నామినేషన్ల గడువు ముగియడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు వి.
విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ అందించారు.ఈ సందర్భంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు మీడియాతో మాట్లాడారు వైసీపీ 30 మంది ఎంపీలం సమిష్టిగా రాష్ట్రం కోసం పోరాడతామన్నారు.
రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయం.ఈ అవకాశం ఇచ్చిన జగన్ కు ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు.బీసీలంటే… బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ అని చాటిన ఏకైక సీఎం జగన్ అని అన్నారు.బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్ దేశానికే ఆదర్శమన్నారు.సంక్షేమ పథకాలకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తే అదేదో నేరమన్నట్టు విమర్శలాని వారు ప్రశ్నించారు.