ఆర్జీవీ దేవుడంటున్న షకలక శంకర్.. కారణం ఇదే..!

ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా కెరీర్ మొదలుపెట్టిన ఎంతోమంది కమెడియన్లు సినిమాలలో వరుస అవకాశాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.అలా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ షకలక శంకర్ వరుసగా సినిమాల్లో హీరో అవకాశాలతో అంతకంతకూ ఎదుగుతున్నాడు.

 Shakalaka Shankar Interesting Comments About Ram Gopal Varma, Ram Gopal Varma,-TeluguStop.com

ఒకవైపు టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూనే కరోనా, లాక్ డౌన్ వల్ల కష్టాలు పడుతున్న పేదలకు తన వంతు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

కామెడీ షోలలో, సినిమాలలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎక్కువగా ఇమిటేట్ చేసే షకలక శంకర్ తాజాగా ఆయన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రామ్ గోపాల్ వర్మ తనకు లాక్ డౌన్ సమయంలో కూడా పని కల్పించాడని.నా సోర్స్ ఇన్‌స్పిరేషన్ ఆర్జీవీ అని.తనతో పాటు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ కు రామ్ గోపాల్ వర్మ పని కల్పించాడని వెల్లడించారు.ఆర్జీవీ మంచి చేసినా చెడు చేసినా.

ఆయన మాటలు ఎలా ఉన్నా అవన్నీ సెకండరీ అని అన్నారు.

కొన్ని రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా పరాన్నజీవి అనే సినిమాలో నటించిన షకలక శంకర్ ప్రస్తుతం రాంగ్ గోపాల్ వర్మ అనే సినిమాలో నటిస్తున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.వర్మ పాత్రలో షకలక శంకర్ నటిస్తుండగా మహేష్ కత్తి, జబర్దస్త్ అభినవ్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా షకలక శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను కేవలం పాత్రలో నటించానని సినిమాకు తనకు ఏ సంబంధం లేదని షకలక శంకర్ అన్నారు.

ఈ సినిమాలో తన డైలాగులు కానీ, క్రియేటివిటీ కానీ ఏమీ లేవని షకలక శంకర్ స్పష్టం చేశారు.ఈ సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ప్రభు గారికే దక్కుతుందని చెప్పారు.

రాంగ్ గోపాల్ వర్మ స్థాయిలో ఆర్జీవీపై సినిమా తీయలేరని తాను ఆర్జీవీగా కనిపించే చివరి సినిమా ఇదేనని షకలక శంకర్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube