మరో రికార్డును బద్దలు కొట్టిన పఠాన్.. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోందిగా?

బాలీవుడ్ బాద్ షా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం పఠాన్.ఇటీవలే విడుదలైన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

 Shah Rukh Khan Pathan To Enter 1000crore Club,shah Rukh Khan, Pathan,deepika Pad-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీని సృష్టిస్తోంది.అయితే వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న షారుఖ్ కి ఈ సినిమా సక్సెస్ ను తెచ్చిపెట్టడంతోపాటు మంచి ఊరటను కలిగించింది.

సినిమా విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది.అనూహ్య కలెక్షన్స్‌తో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.

విడుదలైన తర్వాత ప్రతీ రోజూ రూ.వంద కోట్లకు తగ్గకుండా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది.తొలి వారం పూర్తయ్యేసరికి పఠాన్‌ ఏకంగా రూ.650 కోట్లు కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.ఇప్పటికే కేజిఎఫ్, బాహుబలి 2 లాంటి సినిమాల రికార్డులను బద్దలు కొట్టిన పటాన్ సినిమా తాజాగా శనివారం కలెక్షన్స్‌తో దంగల్‌ సినిమా రికార్డును బ్రేక్‌ చేసింది.అంతే కాకుండా హిందీలో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన మూడో సినిమాగా సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది.

మొదటి రెండు స్థానాల్లో బాహుబలి-2, కేజీఎఫ్‌-2 సినిమాలు ఉన్నాయి.

అయితే పఠాన్ సినిమా జోరు చూస్తుంటే బాహుబలి కే.జి.ఎఫ్ సినిమాల రికార్డులను బద్దలు కొడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇదే జోరు కొనసాగితే పఠాన్‌ వెయ్యి కోట్ల మార్కును అందుకోవడం కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వీకెండ్‌కు ఎలాంటి సినిమాలు లేకపోవడం కూడా పఠాన్‌కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

అంతేకాకుండా ఇప్పట్లో ఏ సినిమాలు కూడా విడుదల అయ్యేలా లేకపోవడంతో పఠాన్ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల మార్కును అందుకుంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube