జంతువులు, పిల్లలు చాలా ప్రమాదం.. షాహిద్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shahid Kapoor Said That He Is Really Scared Of Acting With Children And Animals

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ గురించి మనందరికి తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న షాహిద్ కపూర్ చిన్నపిల్లలు, జంతువులతో నటన అంటే తెగ భయపడిపోతున్నారు.

 Shahid Kapoor Said That He Is Really Scared Of Acting With Children And Animals-TeluguStop.com

జెర్సీ సినిమా రీమేక్ తో జనాల్ని పలకరించబోతున్నాడు కబీర్ సింగ్. చిల్డ్రన్స్ అండ్ అనిమల్స్ తన రిథమ్ బ్రేక్ చేసే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చాడు.

పిల్లలు జంతువులతో కలిసి నటించేటప్పుడు ఏ క్షణంలోనైనా మొత్తమంతా శృతి తప్పిపోవచ్చని హెచ్చరిస్తున్నాడు షాహిద్ కపూర్.

 Shahid Kapoor Said That He Is Really Scared Of Acting With Children And Animals-జంతువులు, పిల్లలు చాలా ప్రమాదం.. షాహిద్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక షూటింగ్ సమయంలో పిల్లలకు ఏది నచ్చితే అది చేస్తారు.

చివరకు వాళ్లకు సరైన షాట్ ఇచ్చేసరికి ఎదుటివారు విసిగిపోయి సగం చచ్చిపోతారు అని అన్నాడు షాహిద్ కపూర్.అయితే షాహిద్ కపూర్ అలా మాట్లాడడానికి కారణం కూడా లేకపోలేదు.

ఎందుకంటే ఆయన పిల్లలు జంతువుల గురించి అలా మాట్లాడడానికి కారణం.జెర్సీ సినిమాలో తండ్రి పాత్రలో నటించాడు షాహిద్ కపూర్.

తెలుగులో జెర్సీ సినిమాలో నాని నటించిన విషయం తెలిసిందే.తెలుగు లో నాని చేసిన క్యారెక్టర్ లో బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించాడు.

Telugu Animals, Bollywood, Jersey Hindi, Kabir Singh, Shahid Kapoor-Movie

ఒక మాజీ క్రికెటర్ గా, ప్రేమికుడిగా, తండ్రిగా, భర్తగా ఇలా అనేక రకాల షేడ్స్ ని పోషించాడు షాహిద్ కపూర్.ఈ క్రమంలోనే షాహిద్ కపూర్ ఒక పిల్లవాడితో నటించాల్సి వచ్చింది.తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ సినిమా పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న షాహిద్ కపూర్ రెండవసారి తెలుగు చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

Telugu Animals, Bollywood, Jersey Hindi, Kabir Singh, Shahid Kapoor-Movie

తెలుగు జెర్సీ సినిమాకు రీమేక్‌గా రూపొందిన హిందీ జెర్సీ సినిమా ఈపాటికే విడుదల అవ్వాల్సి ఉంది.కానీ కరోనా కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.షాహిద్, మృణాళ్ ఠాకూర్ స్టారర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే అని చెప్పవచ్చు.

#Jersey Hindi #Kabir Singh #Animals #Shahid Kapoor #Shahid Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube