క్రికెట్ ఆడుతూ గాయపడ్డ స్టార్ హీరో,ఆగిపోయిన సినిమా షూటింగ్

షూటింగ్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో గాయపడినట్లు తెలుస్తుంది.టాలీవుడ్ లో నాని హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్న ‘జెర్సీ’ సినిమా ను హిందీ వెర్షన్ లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా అదే పేరు తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 Shahid Kapoor Latest Update-TeluguStop.com

అయితే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న షాహిద్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి ఊహించని విధంగా ముఖానికి తగిలడం తో గాయాలపాలైనట్లు తెలుస్తుంది.జెర్సీ సినిమా షూటింగ్ సందర్భంగా షాహిద్ క్రికెట్ ఆడుతున్నాడు ఈ క్రమంలో ఊహించని విధంగా వచ్చిన బంతి షాహిద్ ముఖానికి తగలడం తో దిగువ పెదవి పై తీవ్ర గాయమంది.

దీనితో ఆయన పెదవి చిట్లి రక్తం రావడం తో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రి లో వైద్యులు పరీక్షించి అతని పెదవికి కుట్లు వేసినట్లు తెలుస్తుంది.

అయితే ఈ గాయం నయం కావడానికి 5 రోజుల పాటు టైం పడుతుంది అని చెప్పడం తో షూటింగ్ ను సైతం 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం షాహిద్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

తెలుగులో హిట్ మూవీ గా నిలిచినా జెర్సీ మూవీ ని అదే పేరు తో బాలీవుడ్ లో కూడా షాహిద్ హీరో గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Telugu Bollywoodshahid, Cricketshahid, Jerseycricket, Nani Jersey, Shahid Kapoor

అలానే ఈ చిత్రం హిందీ వెర్షన్ లో అల్లు అరవింద్ సమర్పణ లో అమన్ గిల్,దిల్ రాజు నిర్మిస్తున్నారు.గతంలో షాహిద్ హీరో గా టాలివుడ్ హీరో విజయ్ దేవర కొండ బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో రిలీజై బాలీవుడ్ లో సైతం హిట్ టాక్ ని అందుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా జెర్సీ మూవీ ని కూడా రీమేక్ చేసే పనిలో పడ్డారు.

మరి ఈ చిత్రం కూడా హిట్ ని అందుకుంటే మాత్రం ఖచ్చితంగా షాహిద్ మరోసారి స్టార్ హీరో గా మంచి ఫామ్ లోకి వచ్చేస్తాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube