సమంతతో లవ్‌లో పడిపోయా.. ఆమెతో జర్నీకి సిద్ధం అంటూ బాలీవుడ్ హీరో ఆఫర్?

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించినటువంటి చిత్రం “జెర్సీ”.సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతోమంది తెలుగు సినీ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది.

 Shahid Kapoor About Samantha In Family Man 2, Samantha, Family Man 2, Shahid Kap-TeluguStop.com

తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు.హిందీ రీమేక్ చిత్రంలో షాహీద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగా ఈ సినిమా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం వెల్లడించారు.ఈ సినిమా పూర్తయిన సందర్భంగా నటుడు షాహిద్ కపూర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా అనుభవాలను పంచుకున్నారు.

ఈ సినిమాలో నటించడానికి ప్రధాన కారణం నాని అని నాని నటించిన ఈ సినిమా చూసి తను ఎంతో ఏడ్చేశానని ఈ సందర్భంగా తెలియజేశారు.నిజం చెప్పాలంటే తనకు ఇష్టమైన డైరెక్టర్లలో గౌతమ్ తిన్ననూరి అని ఈ సందర్భంగా షాహిద్ కపూర్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ హీరోకు ది ఫ్యామిలీ మెన్ 2 లో సమంత నటన గురించి పలువురు ట్విట్టర్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు షాహిద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే ఈ సిరీస్ లో సమంత నటనకు తను ప్రేమలో పడిపోయానని, ఫ్యూచర్లో తనతో కలిసి పనిచేయడం కోసం తాను సిద్ధంగా ఉన్నానని ఈ హీరో సమంతకు భారీ ఆఫర్ ఇచ్చారు.

Telugu Bollywood, Samantha, Shahid Kapoor-Movie

ఈ క్రమంలోనే షాహిద్ కపూర్ మాట్లాడుతూ.తనకు స్క్రీన్ పై హృతిక్ రోషన్ ని చూడటం చాలా ఇష్టమని కబీర్ సింగ్.‘సూర్యవంశీ’ మూవీతో మళ్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలో థియేటర్లో తెరచుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ప్రజలందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్ లో సినిమాలు చూడాలని ఈ సందర్భంగా షాహిద్ కపూర్ అభిమానులకు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube