టీమిండియా నెక్స్ట్ ధోనీ అతడే: షాహిద్ ఆఫ్రిది

భారతదేశ ప్రజల పై, టీమిండియా ఆటగాళ్లపై ఎప్పటికప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది, ఈసారి మాత్రం కాస్త భిన్నంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన మాటలతో ముంచెత్తాడు.ఇప్పటికే అనేక సార్లు భారతదేశంలో విషయాలకు జోక్యం చేసుకొని సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసే అతనికి టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పటికే అనేక మార్లు కౌంటర్లు ఇచ్చిన సంఘటనలు అందరికీ విదితమే.

 Shahid Afridi, Ms Dhoni, Shaid Afridhi, Rohith Sharma, Suresh Raina, Socila Medi-TeluguStop.com

అయితే తాజాగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సాహిద్ ఆఫ్రిదీ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నిజంగా అందర్నీ ఆశ్చర్య పరిచేలా సమాధానం ఇచ్చాడు.అసలు ఆ అభిమాని అడిగిన ప్రశ్న విషయానికి వస్తే… మీ దృష్టిలో మహేంద్రసింగ్ ధోని, రికీ పాంటింగ్ లలో ఎవరు గొప్ప కెప్టెన్ అని అడగగా….

దానికి షాహిద్ అఫ్రిది ఖచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనీ అని సమాధానం ఇచ్చాడు.అంతే కాదు దానికి వివరణ కూడా తెలియజేశాడు.

మహేంద్రసింగ్ ధోని యంగ్ స్టార్స్ తో కూడిన జట్టును తయారుచేసి ముందుకు నడిపించాడు అంటూ కామెంట్ రూపంలో తన అభిమానికి రిప్లై ఇచ్చాడు షాహీన్ అఫ్రిది.అంతేకాకుండా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ లాంటి అన్ని ఐసీసీ ట్రోఫీలను అందుకున్న ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటూ తెలియజేశాడు.

అయితే మ్యాచ్ ల విషయంలో మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ కంటే ముందు రికీ పాంటింగ్ ఉన్నాడని తెలిపాడు.

Telugu Msdhoni, Rohith Sharma, Shahid Afridi, Shaid Afridhi, Socila, Suresh Rain

ఆ తర్వాత తాను టీమిండియాలో మహేంద్రసింగ్ ధోని తర్వాత నాయకత్వంలో అతని నాయకత్వ లక్షణాలు తగ్గట్టుగా ఇదివరకు తనకి సురేష్ రైనా కనపడే వాడని, ప్రస్తుతం టీమిండియాలో ఆ నాయకత్వ లక్షణాలు రోహిత్ శర్మ లో కనపడుతున్నట్లు తెలిపాడు.అంతేకాకుండా టీమిండియాకు తరువాతి ఎంఎస్ ధోని “రోహిత్ శర్మ” అంటూ తెలియజేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube