ఆలస్యం అయినా పర్వాలేదు.. వారిని తగ్గద్దు అంటున్న షారుక్..!

టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం అయిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ టోక్యో ఒలంపిక్స్ లో మన భారత దేశ మహిళల హాకీ జట్టు రికార్డ్ నెలకొల్పింది అనే చెప్పాలి.క్వార్టర్స్‌ లో ఎదుట పోటీగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుని ఓడించి సెమీ ఫైనల్‌ లో స్థానం సంపాదించుకున్నారు.1980 వ సంవత్సరంలో జరిగిన మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు భారత హాకీ జట్టు అద్భుతమైన ఆటతో ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఆటలో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌లో మొదటిసారిగా సెమీస్‌ లో అడుగు పెట్టారు.సెమిస్ కి వెళ్లిన భారత హాకీ టీమ్ ను అందరూ అభినందిస్తున్నారు.ఎవరు ఊహించని రీతిలో అందరూ అంచనాలను అధిగమించి భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌ లోకి అడుగుపెట్టడం విశేషం అని చెప్పవచ్చు.

 Shah Rukh, Tweets, Special Message ,sjoerd Marijne, India Women's Team ,coach Re-TeluguStop.com

ఈ జట్టు సాధించిన విజయాన్ని హాకీ జట్టు కోచ్ అయిన సోయెర్డ్‌ మరీన్‌ రియల్ లైఫ్ చక్ దే ఇండియా సినిమాతో పోల్చాడు.

ఆ సినిమాతో పోల్చడానికి కూడా ఒక కారణం ఉంది.

అది ఏంటంటే ఆ సినిమా కూడా మహిళల హాకీ ఆట ప్రదానాంశంతోనే తెరకెక్కింది కాబట్టి.ఈ చిత్రంలో షారుక్ ఖాన్ హాకీ జట్టుకి కోచ్ గా వ్యవహరించారు.ఈ సంతోషాన్ని కోచ్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఇలా అన్నారు.‘ ఐ యామ్ వెరీ సారీ మై ఫ్యామిలీ. నేను రావడం ఆలస్యమవుతుందని ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ పై షారుక్ ఇలా స్పందించారు.

మీరు ఆలస్యంగా వచ్చిన ఏమి సమస్య లేదు.కానీ మీరు వచ్చేటప్పుడు మాత్రం భారత్‌ లోని కొన్ని లక్షల కుటుంబాల కోసం బంగారం తీసుకురండి చాలు.అంటూ మీ మాజీ కోచ్ కబీర్ ఖాన్ అని రిప్లై షారుక్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.

ఇక ఆట విషయానికి వస్తే ఎంతో ఉత‍్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్‌ లో గుర్‌జీత్ అద్భుతమైన గోల్ కొట్టి భారత్‌ కు ఘన విజయాన్ని అందించింది.అయితే ఈ ఆటలో ఎంతో పేరు ఉన్న ఆస్ట్రేలియా మాత్రం సింగిల్ గోల్ కూడా కొట్టకపోవడం గమనించాలిసిన విషయం.

ఇలా మా భారత దేశ మహిళల హాకీ జట్టు మొదటిసారి సెమీస్‌ లో అడుగుపెట్టింది.అలాగే దాదాపు 49 ఏళ్ల తర్వాత మొదటిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్‌ లోకి వెల్లడం విశేషం.

కాకపోతే పురుషుల హాకీ జట్టు తాజాగా బెల్జియం చేతిలో 5 -2 గోల్స్ తో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube