బాక్సాఫీస్ ను షేక్ చేసిన పఠాన్.. అప్పుడే సెంచరీ కొట్టేసిందిగా..

బాలీవుడ్ గత కొన్నాళ్లుగా హిట్ లేక సతమతం అవుతుంది.ఒకవైపు పక్క ఇండస్ట్రీలు అయిన మన సౌత్ భాషలు పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్స్ అందుకుంటూ 1000 కోట్ల ప్రాజెక్టులను మన ఖాతాలో వేసుకుంటుంటే బాలీవుడ్ మాత్రం 100 కోట్ల సినిమాలు కూడా చేయలేక ఘోరంగా విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.

 Shah Rukh Khan's Pathaan Box Office Colletions , Shah Rukh Khan, Pathaan, Pathaa-TeluguStop.com

మరి అలాంటి తరుణంలో జనవరి 25న ”పఠాన్” సినిమాతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.

అంతేకాదు కలెక్షన్స్ విషయంలో కూడా ఆశ్చర్య పరుస్తుంది.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7 వేల స్క్రీన్ లలో రిలీజ్ అయ్యింది.

ఫస్ట్ షో నుండే బాక్సాఫీస్ దగ్గర అదర గొట్టింది.

Telugu Bollywood, Pathaan, Shah Rukh Khan, Shahrukh-Movie

నాలుగేళ్ళ గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఫస్ట్ డే ఈ సినిమా హాఫ్ సెంచరీ పూర్తి చేసి 55 కోట్ల వసూళ్లను సాధించింది.

అలాగే రెండు రోజులు పూర్తి అయ్యే సరికి 65-70 కోట్లు అందుకుందని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

Telugu Bollywood, Pathaan, Shah Rukh Khan, Shahrukh-Movie

ఇలా మొత్తంగా పఠాన్ సినిమా 120 కోట్ల వరకు అందుకుందని తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్ లో ఫస్ట్ డే 55 కోట్ల హైయెస్ట్ కలెక్షన్స్ అందుకుని భారీ ఓపెనింగ్స్ అందుకున్న మొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇలా పఠాన్ రెండు రోజుల్లోనే సెంచరీ పూర్తి చేసింది.

మొత్తం మీద బాలీవుడ్ వర్గాలు ఈ సినిమా విజయంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube