తెలుగు హీరోలకి షారుఖ్ ఖాన్ ఐరన్ లెగ్..?

కొన్ని విషయాలు నవ్వుకోవడానికి బాగుంటాయి.నిజమే కాని, లాజిక్ లేదు అనేలా చేస్తాయి.

 Srk Has Been A Iron Leg For Mahesh And Charan-TeluguStop.com

అలాంటిదే జరిగింది షారుఖ్ ఖాన్ వలన.తెలుగు హీరోల విషయంలో కింగ్ ఖాన్ ది ఐరన్ లెగ్ అని కౌంటర్లు వేస్తున్నారు సోషల్ మీడియా ప్రజలు.ఇంతకి షారుఖ్ తెలుగు హీరోలకి ఏం నష్టం చేసాడు అనేదే కదా మీ అనుమానం.అయితే విషయంలోకి వెళ్దాం.

షారుఖ్ ఖాన్ బ్రూస్ లీ షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు సెట్లోకి వెళ్ళాడు.అందరిని పలకరించి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

ఆ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఇక బ్రహ్మోత్సవం షూటింగ్ మొదలుపెట్టిన కొన్నిరోజులకే బ్రహ్మోత్సవం సెట్ కి వెళ్ళి పలకరించాడు.

ఇప్పుడు ఈ సినిమాకి చాలా నెగెటివ్ టాక్ వచ్చింది.ఈ లెక్కన షారుఖ్ ఖాన్ ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సరదాగా అన్నా, సీరియస్ గా అన్నా … ఇదే లాజిక్ తో మాట్లాడితే, షారుఖ్ నటించిన దిల్వాలే, ఫ్యాన్ రెండూ విఫలమయ్యాయి.దానికి ఇటు మహేష్ ని, అటు చరణ్ ని బాధ్యుల్ని చేయలేం కదా.ఏంటో ఈ సోషల్ మీడియా.వింత మనుషులు, వింత ప్రపంచం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube