ఆర్యన్.. జైల్లో సరిగ్గా తింటున్నావా నాన్న.. ప్రశ్నించిన షారుఖ్ ఖాన్?

Shah Rukh Khan Asks Son Aryan If He Eating Well Emotional Meeting

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.అక్టోబర్ 3వ తేదీన క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో పట్టుపడిన ఆర్యన్ ను అప్పటి నుంచి ఎన్సీబీ అధికారులు తమ కస్టడీలోనే ఉంచుకొని ఈ విషయంపై ఆర్యన్ ను విచారణ చేస్తున్నారు.

 Shah Rukh Khan Asks Son Aryan If He Eating Well Emotional Meeting-TeluguStop.com

ఈ క్రమంలోనే పలుమార్లు ఆర్యన్ కి బెయిల్ రాకపోవడంతో షారుక్ ఖాన్ కుటుంబం ఎంతో ఆందోళన చెందుతున్నారు.గత రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో భాగంగా ఆర్యన్ బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో మరోసారి ఆర్యన్ కి రిమాండ్ పొడిగించారు.

ఇలా మరొకసారి బెయిల్ రద్దు కావడంతో షారుఖాన్ ఎంతో నిరాశ చెందారు.ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ ఆర్యన్‌ను చూసేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి వెళ్లారు.

 Shah Rukh Khan Asks Son Aryan If He Eating Well Emotional Meeting-ఆర్యన్.. జైల్లో సరిగ్గా తింటున్నావా నాన్న.. ప్రశ్నించిన షారుఖ్ ఖాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడికి వెళ్ళిన షారుక్ తన కొడుకుని చూసి ఎంతో భావోద్వేగం అయ్యారని తెలుస్తోంది.సుమారు 20 నిమిషాలపాటు కొడుకుతో మాట్లాడిన షారుఖ్ అతని ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

సరిగ్గా తింటున్నావా లేదా అంటూ షారుక్ ప్రశ్నించగా తనకు జైలు భోజనం పడటం లేదని ఆర్యన్ చెప్పారు.

Telugu Aryan Khan, Bollywood, Drugs, Sharukh Khan-Movie

ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ తన కొడుకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు ఇంటి నుంచి భోజనం పంపించవచ్చా అంటూ అధికారులను అడగడంతో అందుకు కోర్టు అనుమతి తప్పనిసరి అంటూ అధికారులు సమాధానం చెప్పారు.ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ సరైన భోజనం చేయక, ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలియడంతో తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై షారుఖ్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

#Sharukh Khan #Drugs #Aryan Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube