ఎంపీగా ఈనాడు రామోజీరావు ...? ఆ పార్టీ ఇచ్చిన ఆఫర్ ఇదే !   Shah Offered RS Seat To Ramoji Rao     2018-07-17   08:48:12  IST  Sai M

ఈనాడు గ్రూప్స్ సంస్థల చైర్మన్ రామోజీ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపించడంలో రామోజీని మించిన వారు లేరు. ముఖ్యంగా టీడీపీ కి రాజగురువు రామోజీ అనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. ఇవన్నీ పక్కనపెడితే ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్, సక్సెస్ ఫుల్ మీడియా ఛైర్మెన్. తెలుగుదేశం పార్టీ పుట్టింది మొదలు ఇప్పటివరకు తేరా వెనుక ఉండి ఆ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ రాజకీయ చక్రం తిప్పుతున్నాడు. అయితే ఏనాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చింది లేదు. అయితే ఇప్పుడు ఆయన నామినేటెడ్ కోటాలో ఎంపీ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా షా రామోజీరావు ఇంటికి వెళ్లి మరీ ఆయన మద్దతు కోరడం పెద్ద చర్చే అయ్యింది. రామోజీ అమిత్ షా భేటీపై రకరకాల ఊహాగానాలు చెలరేగినప్పటికే అసలు విషయం ఏంటనేది ఎవరికీ స్ప్రష్టంగా తెలియక ఎవరికీ నచ్చినట్టు వారు ఊహించుకున్నారు. అయితే.. రామోజీ , అమిత్ షా భేటీపై తాజాగా ఇప్పుడు బయటికొచ్చిన ఓ వార్త రాజకీయ సంచలనం సృష్టిస్తోంది.

అమిత్ షా, రామోజీని ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ లో భాగంగానే కలిసారని బీజేపీ నేతలు చెప్పినప్పటికీ వారిద్దరి మధ్య రాజకీయ చర్చ జరుగుతుందని అందరూ ఊహించారు.. అయితే ఆ ఊహలు నిజమైనట్టు తెలుస్తోంది. అమిత్ షా ప్రస్తుత రాజకీయాల గురించి రామోజీతో చర్చించారట. తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అలానే రామోజీని వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజెపికి మద్దతు తెలపాల్సిందిగా అమిత్ షా కోరినట్టు తెలుస్తోంది.

దీనికి కనుక ఒప్పుకుంటే కేంద్రం ప్రతిపాదించబోయే రాజ్యసభ సభ్యులలో రామోజీరావుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అమీత్ షా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై రామోజీ స్పందన మాత్రం ఏంటనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. కానీ రామోజీ అమిత్ షా ఆఫర్ ని తిరస్కరించినట్టుగా ఆ సంస్థ ఉద్యోగులు కొంతమంది మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే అసలు వాస్తవం ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ అమిత్ షా ప్రతిపాదన కనుక ఒప్పుకుంటే త్వరలో రామోజీరావు రాజకీయ నాయకుడు అయిపోతాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.