ఆర్టికల్ 370 రద్దుపై ప్రతీకారం తీర్చుకుంటా అంటున్న కాశ్మీర్ మాజీ ఐఏఎస్  

Shah Faesal Threatens Revenge And Violence Over Article 370-

కాశ్మీర్ కి ప్రత్యేక హక్కులు కల్పిస్తూ ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై దేశం యావత్తు బీజేపీ పార్టీకి అండగా నిలబడటంతో పాటు, మోడీ తీసుకున్న ధైర్యమైన నిర్ణయానికి సెల్యూట్ చేసారు.ఈ ఆర్టికల్ 370 రద్దుతో మోడీ గ్రాఫ్ ఊహించని విధంగా మరోసారి పెరిగిపోయింది.అయితే దీనికి కాశ్మీర్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, ఈ ఆర్టికల్ 370ని ఉపయోగించుకొని పాకిస్తాన్ కి సహకారం చేస్తూ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న కొంత మంది నేతలకి కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయడం అసలు మింగుడు పడటం లేదు.అయితే భద్రతా దళాలు వారిని సరౌండ్ చేయడంతో ఎవరూ ధైర్యంలో మాట్లాడలేకపోతున్నారు.ఇక ఆర్మీతో కాశ్మీర్ ని తమ ఆదీనంలోకి తీసుకోవడం భారత్ ని పరోక్షంగా దెబ్బ తీస్తున్న పాకిస్తాన్ కి కూడా మింగుడు పడటం లేదు.దీంతో ఏదో ఒక రూపంలో భారత్ పై పాకిస్తాన్ విషం కక్కే ప్రయత్నం చేస్తుంది.

Shah Faesal Threatens Revenge And Violence Over Article 370--Shah Faesal Threatens Revenge And Violence Over Article 370-

ఇదిలా ఉంటే తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి జమ్మూ కాశ్మీర్ రాజకీయ నేత షా ఫైజల్‌ బక్రీద్‌ పండుగ సందర్భంగా చేసిన వాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకొని బదులు ఇచ్చేవరకు ఈద్‌ జరుపుకోబోనని ఆయన హెచ్చరించారు.

ఈద్‌ అనేది లేదు, తమ భూభాగాన్ని లాక్కోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలు ఆవేదన చెందుతున్నారు.1947 నుంచి దొంగలించి లాక్కున్నదంతా వెనక్కి తీసుకునే వరకు ఈద్‌ జరుపుకునే ప్రసక్తే లేదు.అవమానానికి ప్రతీకారం తీర్చుకునే వరకు ఈద్‌ జరుపుకోను అని ఆయన విద్వేషకరంగా ట్వీట్‌ చేశారు.

జమ్మూకశ్మీర్‌లో ప్రశాంతంగా బక్రీద్‌ పర్వదిన సాగుతున్న సమయంలో రెచ్చగొట్టే రీతిలో ట్వీట్‌ చేసిన ఫైజల్‌ తీరుపై సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.