కనపడకుండా పోతున్న నీడలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

నీడ అనేది కొందరిని భయాందోళనకు గురిచేస్తే మరికొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది.చిన్నతనంలో పిల్లలు ఆడుతూ పాడుతూ నీడతో పోటీపడి అల్లరి చేస్తుంటారు.

 Shadows Disappearing  What Is The Real Matter Odisha Witnesses, Zero Shadow Day,-TeluguStop.com

ఇంకొందరు చిన్నపిల్లలు నీడను చూసి భయం భయంగా ఉంటారు.కొంచెం పెద్దగా ఉన్నవారు అయితే నీడలో చేతులు కదుపుతూ తమాషాలు చేస్తుంటారు.

చనిపోయే వరకూ మన వెంట వచ్చేది నీడ మాత్రమే.ఇదే సత్యమని చాలా మంది అంటుంటారు.

అయితే కొన్ని సినిమాలల్లో నీడ పడని సన్నివేశాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తుంటారు.ఇప్పుడు నీడ గురించి ఎందుకు చెబుతున్నాం అంటే ఇక్కడో చోట నీడ అనేదే కనిపించకుండా పోతోంది.

రెండు వారాల క్రితం ఓ వింత ఘటన చోటుచేసుకుంది.దక్షిణ భారతదేశంలో నీడ గురించి అద్బుతం జరిగింది.

ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం ఉదయం 11:43 గంటల నుంచి దాదాపుగా 3 నిమిషాల పాటు ఓ వింత ఘటన చోటచేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నీడ కనిపించకుండా పోయింది.భువనేశ్వర్‌లోని పఠానీ సమంతా ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సుభేందు పట్నాయక్‌ మాట్లాడుత ‘సూర్యుడు మకరరాశి, కర్కాటక రాశి మధ్య +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత ఏర్పడుతుంది.ఈ సమయంలో సూర్యుడు ఆకాశంలో ఎత్తైన ప్రదేశంలో సరిగా నడినెత్తిన ఉండటం వల్ల నీడ ఏర్పడదు.

అప్పుడు సూర్యుడు స్థానిక ధృవరేఖను దాటుతూ వెళ్తాడు.ఈ సమయంలోనే సూర్య కిరణాలు తిన్నగా పడతాయి.

అందువల్ల భూమిపై ఆ అక్షాంశాల మధ్య ఉన్న వస్తువులు, మనుషుల నీడలు ఏర్పడవు.తిన్నగా పడుతుంది.

అందువల్ల ఏ వస్తువునైనా మనం చూసేటప్పుడు మనకు నీడ కనిపించదు అన్నారు.సూర్య కిరణాలు తిన్నగా పడటం వల్ల భూమిపై ఆ అక్షాంశాల మధ్య ఉన్న వస్తువులు, మనుషుల నీడ అటూ, ఇటూ పడదు.

తిన్నగా పడుతుంది.అందువల్ల ఏ వస్తువునైనా మనం చూసేటప్పుడు మనకు నీడ కనిపించదు.

ఒడిషాలో మే 21 నుంచి జూన్‌ 2 వరకు ఈ వింతను చూసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube